పుత్రోత్సహం అనే మాటను మనం మరోసారి గుర్తుచేసుకోవలసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరానందన్ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ మధ్య నిహారిక పెళ్లిలో కూడా అకీరా నందన్ కనిపించాడు. అబ్బో కుర్రాడు బాగా ఎదిగాడే అని అందరూ అనుకున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలో ఈ కుర్రాడు తండ్రిని మించి కనిపించాడు. పవన్ కళ్యాణ్ పక్కన అకీరా నందన్, ఆ పక్కన మరో మహిళ ఉన్నారు. ఆమె అకీరాకు సంగీతం నేర్పే టీచర్ అంటున్నారు.
కరోనా నుంచి పవన్ కళ్యాణ్ కోలుకున్నాక దిగిన ఫొటోగానే దీన్ని భావిస్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కనిపించడం, పక్కన అకిరా నందన్.. అభిమానులకు ఇంతకంటే కావలసింది ఇంకేముంటుంది. ఇలాంటి ఫొటోలు పెట్టినప్పుడు కాస్త సమాచారం జోడిస్తే ఊహాగానాలకు ఆస్కారముండదు. ఏమీ తెలియకపోవడంతో ఎవరికి తోచిన రీతిన వారు ఊహించుకుంటున్నారు.
మనకు తెలిసిన సమాచారం ప్రకారం అకీరా సంగీతం నేర్చుకుంటున్నాడట. అతడిని సంగీతం క్లాస్ కు తీసుకెళ్లి అక్కడ సంగీతం టీచర్ తో కలిసి ఈ ఫొటో దిగారని అంటున్నారు. ఇంతకుమించి ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. మొత్తానికి కెరీర్ లో అకీరా ఎలా ఎదుగుతాడోగానీ ఇక్కడ మాత్రం తండ్రిని మించి ఎదిగాడనే చెప్పాలి. మరి అకీరా నందన్ సినిమాల్లో ఎటు వైపు మొగ్గు చూపుతాడో చూడాలి.
Must Read ;- పవర్ స్టార్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతోందట.. !











