ఏపీలో వరద బాధితులను ఆదుకునందుకు సినీ తారలు కదిలి వస్తున్నారు. తమ విరాళాలను వరుసగా ప్రకటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన వర్షాలకు ఇళ్ల, చెట్లు నేలమట్టమయ్యాయి. పలు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.
వరద బాధితులను ఆదుకునేందుకు కోసం ఇప్పటికే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితిని చూసి సినీ హీరోలు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ కలసి రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా రూ. 25 లక్షల సాయాన్ని ప్రకటించారు. ప్రజలను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రజలను ఆదుకోవడానికి తమ వంతు సాయం చేస్తున్నట్లుగా వీరు తెలిపారు. మహేష్ బాబు కూడా ట్విట్టర్ ద్వారానే ఈ సాయాన్ని ప్రకటించారు. ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా తాముంటామని మెగా ఫ్యామిలీ హీరోలు అంటున్నారు. వరుసగా ఈ ప్రకటనలు వస్తున్నాయి. మరి కొందరు హీరోలు కూడా తమ వంతు సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ తరఫున ఇంతకుముందు నిర్మాత అల్లు అరవింద్ రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ విరాళాలను అందించే ఏర్పాటు చేశారు.
Must Read ;- సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు.. చిత్ర పరిశ్రమకు ఊరట











