సినిమా రంగంలో వెలిగిపోతున్న జిగేలు రాణి ఏంచేస్త్తోంది అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సందర్భంలో తమ ఉనికిని సినిమా వాళ్లు తప్పకుండా చాటుకోవాలి. లేకపోతే వాళ్లను జనం మరచిపోతారు కూడా. అలా మరిచపోకుండా సోషల్ మీడియాలో తళుక్కుమంటూ మెరుస్తుంటారు. ఇక మన జిగేలు రాణి విషయానికి వద్దాం. ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడామె పూర్తిగా కోలుకుందట.
కోలుకోగానే తనకు నెగిటివ్ వచ్చిందని ప్రకటన కూడా చేసింది. కాకపోతే కరోనా నుంచి కోలుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెబుతోంది ఈ భామ. ఈ విషయంలో ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోందో చూద్దాం. ఇంట్లో ఆక్సీ మీటర్ ఉంచుకోవాలట. తరచూ ఆ మీటర్ తో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలట. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో తెలియదు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఆక్సిజన్ లెవల్స్ చూసుకుంటూ ఉండాలట.
అలాగే పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం, బలమైన ఆహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడంలాంటివి కూడా చేయాలట. బలమైన ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువ తాగడం వల్ల చర్మం, జుట్టు పొడిబారకుండా ఉంటాయట. అన్నటికన్నా ముఖ్యం మనం ధైర్యంగా ఉండటం అంటోంది ఈ అమ్మడు. ‘నేనిప్పుడు బుగున్నా.. నా అదృష్టం ఏమిటంటే.. స్వల్ప లక్షణాలతో నేను బాధపడ్డాను. నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉంటున్నాను’ అంటూ వివరించింది.
Must Read ;- పారితోషికం ఓ రేంజ్ లో పెంచేసిన బుట్టబొమ్మ











