పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్. ఈ క్రేజీ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే.. ఇందులో ప్రభాస్ రాముడుగా నటించడం ఓ విశేషమైతే.. ఇది ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రైయిట్ బాలీవుడ్ మూవీ కావడం మరో విశేషం.

ప్రభాస్ రాముడు అయితే.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నారు. ఇక సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ పేరు వినిపిస్తోంది కానీ.. ఇంకా అఫిషియల్ గా ప్రకటించలేదు. సీతగా కృతిసనన్ పేరు బయటకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయ. అందుకనే సీత పాత్ర విషయంలో ఆలోచనలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సీత పాత్ర పోషించేది ఎవరు అనేది ఫైనల్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ప్రకటించిన సలార్ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ చేయడానికి అంతా రెడీ చేసారు.
సమ్మర్ కి సలార్ షూటింగ్ పూర్తి చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేసారు. దీంతో ఆదిపురుష్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 19 నుంచి ఆదిపురుష్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ . ఇంతకీ ఎక్కడ షూటింగ్ చేయనున్నారు అంటే.. ముంబైలోని ఓ స్టూడియోలో షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సమాచారం. ఈ సినిమాని 2022 ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నారు.
Must Read ;- ప్రభాస్.. ‘ఆదిపురుష్’ ఇంట్రెస్టింగ్ అప్ డేట్











