పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దృష్టి ముంబయిపైనే ఉన్నట్లు సమాచారం. అందుకే అక్కడ ఓ ఇల్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. మన తెలుగు హీరోలు చాలామంది హిందీ సినిమాలు చేసినా ఎవరికీ అక్కడ నిలదొక్కుకునే అవకాశం లభించలేదు. ఆ అవకాశం ఇప్పుడు ప్రభాస్ కు మాత్రమే లభించింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో మాత్రం హిట్ గా నిలిచింది. దీన్ని బట్టి ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. అలాగే ‘ఆదిపురుష్’ చేయబోతున్నాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఉండనే ఉంది. ఈ మూడు సినిమాలూ పాన్ ఇండియా సినిమాలే. పైగా ‘ఆదిపురుష్’ షూటింగ్ కోసం ప్రభాస్ ఎక్కువ కాలం ముంబయిలోనే ఉండే అవకాశం ఉంది. అలా చూసుకున్నప్పుడు ముంబయిలో ఓ ఇల్లు ఉంటే మంచిదని ప్రభాస్ అనిపించిందట. ప్రభాస్ సన్నిహితులు కూడా ఆ విషయంలో ఆయనను ప్రోత్రహిస్తున్నట్టు సమాచారం. ‘ఆదిపురుష్’ షూటింగ్ జరిగినన్ని రోజులూ హోటల్ లో కాకుండా ఫ్లాట్ లో ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి ప్రభాస్ వచ్చారట. అందుకే మంచి పోష్ ఏరియాలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. దాదాపు రూ. 75 కోట్లు పెట్టి ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు సమాచారం
ప్రభాస్ బాటలోనే మరికొందరు నటులు కూడా పయనిస్తున్నారట. అందులో కొందరు హీరోయిన్లు కూడా ఉన్నారు.
ప్రభాస్ చేస్తున్న సినిమాల బిజినెస్ కూడా మామూలుగా లేదు. ‘సలార్’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. దీనికి ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయట. దీని డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు సమాచారం.
ఇంతవరకు ఏ బాలీవుడ్ స్టార్ సినిమాకీ ఇంత ఆఫర్ రాలేదు. ప్రభాస్ కు అంతర్జాతీయంగా ఆ స్థాయిలో అభిమానులు ఉండటమే అందుకు కారణం. అలాంటప్పుడు ప్రభాస్ హైదరాబాద్ లో ఉంటూ తెలుగు సినిమాలు చేస్తూ కూర్చోవడం కన్నా ముంబయిలోనే స్థిరపడి సినిమాలు చేసుకోవడమే మంచిదేమో. ఇప్పటికే నటి రష్మిక కూడా అక్కడే స్థిరపడిందట. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా అక్కడికే మకాం మార్చినట్టు తెలుస్తోంది.
Must Read ;- పారితోషికంలో ప్రభాస్ ఖాన్ త్రయాన్నే మించిపోయాడా?