పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఎనౌన్స్ చేశారు కానీ.. ఇందులో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. అయితే.. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కన్ ఫర్మ్ అంటూ గట్టిగా వినిపించింది. త్వరలోనే దిశా పేరును ఎనౌన్స్ చేస్తారనుకుంటే.. తాజాగా శృతి హాసన్ కన్ ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు వచ్చిన్పటి నుంచి దిశాని తప్పించడం వెనక కారణం ఏంటి.? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. మేటర్ ఏంటంటే.. ప్రభాస్ సరసన దిశా పటాని అయతే.. బాగుంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావించారట. అయితే.. ఈ సినిమాని సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. అందుచేత 60 రోజులు డేట్స్ ఇవ్వాలని అడిగారట. దిశా ఇప్పటికిప్పుడు 60 రోజులు డేట్స్ ఇవ్వాలంటే కష్టం అని చెప్పిందట. అందుకనే దిశాని పక్కన పెట్టారని తెలిసింది.
ఇప్పుడు శృతిహాసన్ తో పాటు మరో హీరోయిన్ తో కూడా చర్చలు జరుపుతున్నారని సమాచారం. రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటిం గ్ ఫిబ్రవరి మొదటి వారంలోనే మొదలు కానుంది. స్పీడ్ గా సినిమాని పూర్తి చెయ్యాలనేది ప్లాన్. అందుకే బల్క్ గా డేట్స్ ఇచ్చే హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. అలాగే, ప్రభాస్ సరసన ఇంతకుముందు నటించని భామనే తీసుకోవాలని అనుకున్నారట. మరి.. ప్రభాస్ సరసన నటించే అవకాశం ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
Must Read ;- శృతిహాసన్ మళ్లీ లవ్ లో పడిందా?











