మలయాళం సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆరాట్టు’. ఈ సినిమాకు దర్శకుడు ఉన్నికృష్ణన్. ఈమధ్యనే మోహన్ లాల్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించాడని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మోహన్ లాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో మోహన్ లాల్ ముఖం చూపించకుండా వెనకాల నుండి కారు దిగే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆయన పూర్తి స్టైలిష్ లుక్ ను టీజర్ లో మాత్రమే రివీల్ చేస్తారని సమాచారం.
ఈ ఫస్ట్ లుక్ లో మోహన్ లాల్ వెనకాలనుండి డైనమిక్ గా కనపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే అనేకమంది మోహన్ లాల్ అభిమానులు రీట్వీట్లు చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు సైతం పోస్టర్ పై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.
సినిమాకు సంబంధించిన టీజర్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తాడని దర్శకుడు తెలిపాడు. ఇందులో ఆయన నటనా విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకులు చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. సినిమాను మళయాళంతో పాటు తమిళ్, తెలుగు భాషలలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల చేయనున్నారని సమాచారం.
#Aaraattu first look poster pic.twitter.com/HlUMt83AEU
— Mohanlal (@Mohanlal) December 6, 2020
Must Read ;- సుజిత్ నెక్ట్స్ మూవీకి హీరో ఇతడేనా?










