ఈ ఏడాది విక్టరీ వెంకటేశ్ సినిమాల లైనప్ చూస్తే మతిపోతుంది. ముచ్చటగా మూడు సినమాల్ని ఏకకాలంలో పట్టాలెక్కించడమే కాకుండా.. ఆ మూడింటినీ ఈ ఏడాదే విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకున్న ఏకైక హీరోగా ఆయన టాలీవుడ్ లో ఓ కొత్త రికార్డు నెలకొల్పుతున్నాడు. ‘నారప్ప, ఎఫ్ 3, దృశ్యం2’ మూవీస్ ను ఈ ఏడాదే విడుదల చేయబోతున్నాడు.
ప్రస్తుతం ‘నారప్ప’ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాల్ని పూర్తి చేసే పనిలో ఉంది. మే 14న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ‘నారప్ప’ శివరాత్రి స్పెషల్ గా ఒక పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. అందులో వెంకటేశ్ యంగ్ లుక్ తో రివీలయ్యాడు. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ కి రీమేక్ గా రూపొందుతున్న నారప్పలో వెంకీ.. రెండు గెటప్స్ లో కనిపిస్తారు.
యంగ్ గా ఉండే లుక్ తో ఆయన ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తారు. ఆ తర్వాత ఇద్దరు కొడుకుల తండ్రిగా వర్తమానంలో కనిపిస్తారు. ఇప్పటి వరకూ మనకి నారప్పలో వెంకీ ఓల్డ్ గెటప్పే పోస్టర్స్ మీద దర్శనమిచ్చింది. ఇప్పుడు యంగ్ లుక్ కూడా రివీలైంది. ప్రస్తుతం ఈ గెటప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి నారప్పగా వెంకీ ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తారో చూడాలి.
Must Read : ‘నారప్ప, ఎఫ్ 3’.. రెండింటిలో ఏది ముందు రిలీజ్ కానుంది.?











