డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి రెండు డ్రీమ్స్ ఉండేవి.. ఒకటి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ తో సినిమా చేయాలని, అలాగే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో ఓ మాస్ మూవీ తీయాలని. అయితే అమితాబ్ తో ‘బ్డుడా హోగా తేరా బాప్’ అనే పోకిరి స్టైల్ మూవీ తీసి . హిట్ కొట్టాడు పూరీ. కానీ చిరుతో సినిమా తీయాలనే కల అలాగే మిగిలిపోయింది.
అందులో భాగంగానే.. పూరీ జగన్నాథ్ .. మెగాస్టార్ 150వ సినిమా చేయాలని తెగ ఉత్సాహపడ్డాడు. దానికోసం ఓ మాస్ యాక్షన్ స్టోరీని రెడీ చేసి దానికి ‘ఆటోజానీ’ అనే టైటిల్ కూడా పెట్టేశాడు. అయితే చిరంజీవికి సెకండాఫ్ స్టోరీ నచ్చక .. దాన్ని పక్కన పెట్టారు. అయితే త్వరలో అదే కథను.. పూరీ మరో మాస్ హీరోతో చేద్దా మనుకుంటున్నాడట. అతడు మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ.
పూరీ జగన్నాథ్ .. తన కెరీర్ లోనే అత్యధిక సినిమాలు తీసింది ఒక్క రవితేజతోనే. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే, దేవుడు చేసిన మనుషులు’. వాటిలో ‘నేనింతే’ యావరేజ్ కాగా, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆరోసారి .. పూరీ ఆటోజానీ కథ రవితేజ తో రూపొందనుందని టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోందని వినికిడి. పూరీ అడిగితే.. రవితేజ కాదనడు. ఎలాగైనా సరే.. తన కాల్షీట్స్ అడ్జెస్ట్ చేసుకుంటాడు. మరి ఈ కాంబో మూవీ ఎప్పుడు లాంఛ్ అవుతుందో చూడాలి.
Must Read ;- దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చేసిన ‘పోకిరి’











