యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం ప్లానింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. మార్చి నుంచి ఈ మూవీని స్టార్ట్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. అఫిషియల్ గా ప్రకటించాల్సివుంది. ఈ భారీ చిత్రానికి అయిననూ పోయిరావలే అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే.. కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో నటించిన అన్షు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. మన్మథుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. పాత్రకు తగ్గట్టుగా నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఆతర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత శివాజీ, లయ, భూమిక నటించిన మిస్సమ్మ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఏ సినిమాలోను నటించలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీలో కీలక పాత్ర చేస్తుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. ఈ వార్త వాస్తవమేనా కాదా అనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తుంటే.. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కి సంభాషణలు – స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫ్రీ అయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
Must Read ;- ఎన్టీఆర్ మూవీలో ముగ్గురు సీనియర్ హీరోలు.. ఎవరు వాళ్ళు?