దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న యాక్షన్ డ్రామా ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వంలోని ఈ సినిమా నక్సల్ బరీ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోంది. 1992 లో నక్సల్ బరీ ఉద్యమం తీవ్రంగా ఉన్న టైమ్ లో కొందరు నక్సలైట్స్ .. కొంతకాలం పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో ఒక ప్రదేశంలో అజ్ఞాత వాసం చేస్తారు. అప్పుడు సంభవించిన కొన్ని అనూహ్యమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
నక్సల్ నాయకుడిగా రానా దగ్గుబాటి, మహిళా వింగ్ లో ప్రియామణి, నందితా దాస్, నివేదా పెతురాజ్ నటిస్తుండగా.. అనుకోని పరిస్థితుల్లో నక్సలైట్ గా మారే అమ్మాయిగా సాయిపల్లవి నటిస్తోంది. మహిళా దినోత్సవం సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఈ సినిమాలో నటించే నటీమణులు రివీలయ్యారు. దీంతో పాటు రానా వాయిస్ తో ఒక వీడియో ను కూడా విడుదల చేశారు. ఇందులో నటించే మహిళా పాత్రల గొప్పతనాన్ని రానా వివరించే ఆ వీడియో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 30న ‘విరాట పర్వం’ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు పోస్టర్ మీద మెన్షన్ చేశారు మేకర్స్. మరి ఈ మూవీ రానాకి ఏ స్థాయిలో ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- రానా తమ్ముణ్ణి ఆ డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాడా?