Reason Behind Venkatesh Remake Movies :
వెంకటేష్ నటించిన సినిమాలు నారప్ప, దృశ్యం 2. ఈ రెండు సినిమాలను థియేటర్లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ.. సురేష్ బాబు మాత్రం ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇండస్ట్రీలో సురేష్ బాబు పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే.. సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద కథ ఉందట. ఇంతకీ విషయం ఏంటంటే.. ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎంత గొడవ పెట్టినా నిర్మాత సురేష్ బాబు తనదైన స్టైల్ లోనే ‘నారప్ప’, ‘‘దృశ్యం2’ చిత్రాలను ఓటీటీలో విడుదల చేసేస్తున్నారు.
ఇక్కడే అసలు తిరకాసు వుంది. ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఈ సినిమాలు థియేటర్లో విడుదల అవుతాయని భావించారు. కానీ మొదట్నుంచి సురేష్ బాబుకు ఆ ఆలోచన లేదట. ఈ కరోనా టైంలో రెండు రీమేక్ సినిమాలను ఎంచుకోవడానికి కారణం కూడా అదే. మేటర్ ఏంటంటే.. ఈ కరోనా టైంలో థియేటర్ కు రావడానికి ప్రేక్షకులు భయపడుతున్నారు. సాధారణంగా వెంకటేష్ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు.
ఇలాంటి సమయంలో ఈ రెండు చిత్రాలను థియేటర్లలో విడుదల చేస్తే ఆశించిన స్ధాయిలో జనాలు థియేటర్కు రాకపోవచ్చు. ఆ తర్వాత ఓటీటీలో ఇప్పుడిస్తున్న 76 కోట్లు ఇవ్వక పోవచ్చు అనే ఉద్ధేశ్యంతోనే ఈ స్టెప్ తీసుకొని వుండచ్చు అంటున్నారు. నారప్ప సినిమాను 40 కోట్లకు అమెజాన్ కు అమ్మేశారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ నెల 20న స్ట్రీమింగ్ కానుంది. దృశ్యం 2 36 కోట్లు అమ్మేశారు. రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించాల్సివుంది.
Must Read ;- అసురన్ ను మించి నారప్ప.. ట్రైలర్ లో వెంకీ అదరగొట్టాడుగా











