‘కేజీఎఫ్’ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యశ్. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో యశ్ తదుపరి చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మీదే ఉంది. అందరి దృష్టి. మొదటి భాగాన్ని మించిన రీతిలో రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. నేడు యశ్ పుట్టిన రోజు. నిజానికి ఈ రోజు 10గంటలకు ‘కేజీఎఫ్ 2’ టీజర్ విడుదచేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న రాత్రే టీజర్ విడుదలయింది. అంతేకాదు ఆ టీజర్ ను రికార్డు స్థాయిలో 20 మిలియన్స్ పైగా వ్యూస్ తెచ్చుకుంది.

ఇది రాకీ భాయ్, రాక్ స్టార్.. యశ్ అందించిన కానుకగా అభిమానులు భావిస్తున్నారు. అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గనిరీతిలో ‘కేజీఎఫ్ 2’ టీజర్ ఉండడంతో.. యశ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య, నటీమణి రాధికా పండిట్ తో ఆయన తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. పుట్టిన రోజు కేక్ కట్ చేసి యశ్ తన భార్య కు తినిపిస్తోన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- టీజర్ టాక్ : పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కేజీఎఫ్ 2’











