రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్ని లైన్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇకపై అతడు టేకప్ చేసే ప్రతీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా పాన్ ఇండియా కేటగిరిలో చేయడానికే నిశ్చయించుకున్నాడు. ప్రస్తుతం చేస్తోన్న ‘రాధేశ్యామ్’ తర్వాత ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలతో పాటు .. ‘సలార్’ అనే మూవీకి కూడా అత్యధిక ప్రధాన్యతనివ్వబోతున్నాడు. బహుశా ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఇదే అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ‘సలార్’ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ‘సలార్’ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్ గా నటించబోతున్నాడట. ఆ మేరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ .. జాన్ కు హైయెస్ట్ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశాడట. దాంతో అతడు ప్రభాస్ తో ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని తెలుస్తోంది.
మాఫియా డాన్ గా ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ సినిమా అంచనాలు పెంచేస్తోంది. ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ సినిమా బిజీలో ఉన్న ప్రశాంత్ .. ఆ సినిమా షూట్ కంప్లీట్ కాగానే.. ‘సలార్’ మూవీ పై కాన్సెన్ ట్రేట్ చేయబోతున్నాడు. ప్రభాస్ కూడా ‘రాధేశ్యామ్’ తర్వాత ఈ సినిమా మీదే ప్రధానంగా దృష్టిపెట్టబోతున్నడని తెలుస్తోంది. మరి జాన్ అబ్రహం విలనీ సలార్ కు ఏ మేరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పోస్టర్ అదరహో
https://www.youtube.com/watch?v=NPhAP5fYHYY











