అల్లు అర్జున్ – రష్మిక హీరోహీరోయిన్లుగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ లో సమంత మెరవబోతోందట. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రంగస్థలంలో జిగేలు రాణిగా పూజేహెగ్డేని ఐటమ్ సాంగ్ లో చూపిస్తే జనం తెగ ఎంజాయ్ చేశారు. మరి అలాంటి సాంగ్ ఒకటి పుష్పలో కూడా పెట్టాలని సుకుమార్ భావించారు.
దీని కోసం తమన్నా, పూజా హెగ్డేలను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ స్థానంలో సమంత చేరిపోయింది. సమంత దాదాపు కన్ ఫర్మ్. దేవిశ్రీ బీట్ కు సమంత స్టెప్పులు తోడైతే ఇంకెలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇప్పటిదాకా సమంత ఏ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ చేయలేదు. ఈ పాటని ఈ నెలాఖరులో చిత్రీకరించనున్నారు. ఈ సినిమా మొదటిభాగం డిసెంబరు 17న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
మైత్రీ మూవీమేకర్స్ దీన్ని పాన్ ఇండియా సినిమాగా మలిచింది. ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. సమంత ఇందులో నటిస్తున్నట్లు అధికారికంగానే వార్తలు వచ్చాయి. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాని హిందీలో డబ్బింగ్ హక్కులను ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కు అమ్మినట్టు సమాచారం.
Must Read ;- తాను పర్ ఫెక్ట్ కానంటూ ఇన్ స్టాలో సమంత పోస్ట్!











