డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ .. తాజా చిత్రం ‘శశి’. కొత్త దర్శకుడు శ్రీనివాస నాయుడు తెరకెక్కించిన ఈ సినిమా ఓ మ్యూజికల్ లవ్ స్టోరీ. ప్రేమలోని బాధ, ఎమోషన్స్ ను ఈ సినిమాతో చక్కగా ఆవిష్కరించబోతున్నారు. సురభి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా రేపు అంటే.. మార్చ్ 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర యూనిట్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారిని దర్శించుకుంది.
హీరో ఆది, హీరోయిన్ సురభితో పాటు చిత్ర దర్శకుడు శ్రీనివాస నాయుడు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం కొండపై ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత కాలంగా సరైన హిట్స్ లేని ఆది సాయికుమార్ కు శశి సినిమా ఫామ్ లోకి తీసుకొస్తుందని ఆశిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఆది ఏ స్థాయిలో విజయం సొంతం చేసుకుంటాడో చూడాలి.
Must Read :ట్రైలర్ టాక్ : అందమైన ప్రేమకథ ‘శశి’
Team #Sashi visited 'Vijayawada Kanaka Durgamma Temple' today for the blessings!
Movie Releasing Tomorrow!! 💥
Book Your Tickets 🎟️ on @Paytm
& @bookmyshow #SashiReleasingTomorrow #AadiSaiKumar @Subhiactress @Arunchiluveru @SNaiduNadikatla @rpvarmadatla @WhackedOutMedia pic.twitter.com/GZ7NsbAReF— BA Raju's Team (@baraju_SuperHit) March 18, 2021











