సీనియర్ నరేష్ పెళ్లి చిత్రం.. భళారే విచిత్రమే. ఆయన నటించిన సినిమా పేరు లాగానే ఆయన వివాహ జీవితం కూడా ఉందంటే ఆశ్చర్యంగా లేదూ. 1980 దశకంలో యాక్షన్ మూవీస్ హవా నడుస్తున్న టైమ్ లో ఇద్దరు హాస్య కథానాయకులు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అందులో ఒకరు రాజేంద్రప్రసాద్ కాగా మరొకరు నరేష్. నరేష్ 1970లో రెండు కుటుంబాల కథ, 1972లో ‘పండంటి కాపురం’ చిత్రాల్లో బాలనటుడిగా నటించారు.
ఆ తర్వాత తల్లి విజయనిర్మల దర్శకత్వంలో 1982లో ‘ప్రేమ సంకెళ్లు’ చిత్రంలో హీరోగా నటించారు. ఆతర్వాత నాలుగు స్తంభాలాట, రెండు జెళ్లసీత, శ్రీవారికి ప్రేమలేఖ, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, జస్టిస్ రుద్రమదేవి, కోకిల తదితర చిత్రాల్లో నటించారు. జంధ్యాల, రేలంగి నరసింహారావు దర్శకుల చిత్రాల్లో ఈ హాస్య కథానాయకులు ఎక్కువగా నటించేవారు.
అయితే.. రామచంద్రరావు దర్శకత్వంలో నరేష్ నటించిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. ఈ సినిమా నరేష్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత 1993లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘జంబలకిడిపంబ’ నరేష్ కి మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఆమె, కొంగుచాటు కృష్ణుడు, శివ శక్తి, పెళ్లి నీకు శుభం నాకు, ఏంటి బావా.. మరీనూ, సొగసు చూడతరమా తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఇక నరేష్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆయన సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ నవీన్ అనే కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆతర్వాత నరేష్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కూడా కలిసి రాలేదు.. చివరికి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నరేష్ 50 ఏళ్ల వయసులో సీనియర్ రాజకీయ నాయకుడైన రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్యను 2010లో హిందూపురంలో పెళ్లి చేసుకున్నారు. ఇదండీ నరేష్ పెళ్లి సంగతులు.
Must Read ;- రామానాయుడు మాటవరుసకి అన్నమాటకి నష్టం రూ. 5 లక్షలు