60 సంవత్సరాలు దాటిన వారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నావారు .. కరోనా వేక్సిన్ తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కరోనా వేక్సిన్ తీసుకుంటున్నారు. మొన్నామధ్య బాలీవుడ్ సినియర్ హీరోయిన్ శిల్ప శిరోద్కర్ , కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, ఇటీవల నాగార్జున, కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోస్ .. కరోనా వేక్సిన్ తీసుకొని ఇతరులకు ప్రేరణగా నిలిచారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ చేరారు. వారు ఎవరో కాదు.. సుహాసినీ మణిరత్నం, రమ్యకృష్ణ .
ప్రస్తుతం సుహాసినీ మణిరత్నం వయసు 60, రమ్యకృష్ణ వయసు 50. వీరిద్దరూ ఇప్పుడు వేరు వేరు ప్రాంతాల్లో కరోనా వేక్సిన్ ను తీసుకొని.. ఫోటోస్ ను తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. ఇతరులకి నమ్మకంగా కరోనా వేక్సిన్ తీసుకోండి అంటూ సూచిస్తున్నారు. వేక్సిన్ అంటే భయపడేవారు నిర్భయంగా వేక్సిన్ తీసుకోండి అంటూ.. తమ ఫోటోల ద్వారా వేక్సినేషన్ మీద అవేర్ నెస్ కల్పిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరినీ అభినందించాల్సిందే. సినీ ఫీల్డ్ లో కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ ఇద్దరూ ఇలా వేక్సిన్ తీసుకున్నారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ఇద్దరి ప్రేరణతో ఇంకెంత మంది సినీ సెలబ్రిటీస్ వేక్సినేషన్ తీసుకుంటారో చూడాలి.
Must Read ;- వాళ్లకూ వ్యాక్సిన్ : కరోనా కేసుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం











