భూమి వైపు రెండు భారీ గ్రహ శకలాలు దూసుకొస్తున్నాయని నాసా బాంబు పేల్చింది. ఆస్టరాయిడ్ 2020 TB9, ఆస్టరాయిడ్ ST1గా పిలువబడుతున్న నాసా గుర్తించింది. ఇది గంటకు 21,600 కిలోమీటర్ల వేగంతో దూఈ గ్రహశకలాలు అత్యంత ప్రమాదకరమని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటిలో ST1 గ్రహశకలం 175 మీటర్ల వ్యాసంతో రెండు పుట్ బాల్ కోర్టుల సైజులో ఉందని ప్రకటించారు. ఇది గంటకు 28 వేల 646 కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తోందని నాసా ప్రకటించింది. ఇక రెండవది TB9 గ్రహశకలం 30 మీటర్ల వ్యాసంతో, ఒక భారీ విమానం సైజులో ఉంటుందని సుకొస్తోంది. ఇవి రెండూ భూమికి 7 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
మరో రెండు గ్రహ శకలాలు కూడా..
ఆస్టరాయిడ్ 2020 TB9, ఆస్టరాయిడ్ ST1లతోపాటు మరో రెండు గ్రహ శకలాలు కూడా భూమి వైపు దూసుకొస్తున్నాయని నాసా తెలిపింది. ఆస్టరాయిడ్ 2020VL1, 2020VL5 గా నాసా వెల్లడించింది. ఇవాళ అర్థరాత్రిలోగా భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని నాసా స్పష్టం చేసింది. ఆస్టరాయిడ్ 2020VL1 భూమికి చంద్రుడికి మధ్య దూరానికి మూడు రెట్ల దూరంలో ఉన్నట్లు నాసా వెల్లడించింది.
కంగారు వద్దు- ప్రమాదం లేదు
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ నాసా మరికొన్ని వివరాలను వెల్లడించింది. సహజంగా భూమి నుంచి 46.5 మిలియన్ల కన్నా ఎక్కవ దూరం నుంచి గ్రహ శకలం అతి వేగంతో దూసుకొస్తే దాన్ని ప్రమాదకర ఆస్టరాయిడ్ గా గుర్తిస్తామని నాసా ప్రకటించింది. ఇప్పటి వరకు ఇలాంటి వాటిని నాసా శాస్త్రవేత్త 22 గుర్తించారు. అయితే ఇప్పటి వరకు గ్రహ శకలాల వల్ల పెను ప్రమాదాలు చోటు చేసుకోలేదు. తాజాగా దూసుకొస్తున్న గ్రహశకలాలు కూడా భూమిని తాకకపోవచ్చని నాసా ప్రకటించింది.











