జీహెచ్ఎంసీ ఎన్నికల వాతావరణంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతూనే మరోవైపు అధికార, విపక్ష పార్టీలన్ని ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ భారీ ఆఫర్లతో ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా పట్టుకోల్పోయిన టీడీపీ మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పాటుపడుతోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసీ తమ సత్తా చాటేందుకు తెలుగు తమ్ముళ్లు కృషి చేస్తున్నారు. అందుకుగానూ ఈ ఎన్నికల్లో దాదాపు 95 స్థానాల్లో తమ అభ్యర్థులను టీడీపీ నిలిపింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గానూ హ్యాపీ హైదరాబాద్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ సోమవారం విడుదల చేసింది. సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి.
టీడీపీ మేనిఫెస్టులోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి
-ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా-పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్
-ప్రతి ఇంటికి పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా
-ప్రతి పేదవారికి పక్కా గృహాల నిర్మాణం చేపట్టడం
-డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం
-అన్ని ముఖ్యమైన కూడళ్లలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం
-మెట్రో రైలు విస్తరణ, ఎంఎంటీఎస్ నగరం నలుమూలల విస్తరణ
-యువతకు, మహిళలకు ఉపాధి రుణాలను బ్యాంకుల ద్వారా అందజేయడం
లాంటి ఇతర హామీలతో కూడిన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ఉంది.
Must Read ;- అది దీపావళి కానుకనా? జీహెచ్ఎంసీ ఎన్నికల తాయిలమా?











