రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు సుజిత్. ఓ షార్ట్ ఫిల్మ్ తో మెప్పించి.. రన్ రాజా రన్ సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుంటే.. ఆతర్వాత రన్ రాజా రన్ సినిమాతో సక్సస్ సాధించి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే సాహో. ఈ పాన్ ఇండియా మూవీ సౌత్ లో సక్సస్ సాధించకపోయినా.. నార్త్ లో మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా నార్త్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో నిరూపించింది.
అయితే.. సౌత్ లో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను మాత్రం సాహో నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుజిత్ మెగాస్టార్ చిరంజీవితో లూసీఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్టు వార్తలు వచ్చాయి. సుజిత్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసీఫర్ కి మార్పులు చేర్పులు చేశాడు కానీ.. అవి చిరంజీవిని మెప్పించలేకపోయాయి. ఆతర్వాత లూసీఫర్ రీమేక్ కోసం వినాయక్ రంగంలోకి దిగడం.. వినాయక్ కూడా తప్పుకుంటే.. మెహన్ రాజా రంగంలోకి రావడం.. ఇటీవల ఎనౌన్స్ చేయడం జరిగింది.
లూసీఫర్ రీమేక్ నుంచి తప్పుకున్న సుజిత్.. శర్వానంద్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా ప్రకటించలేదు. తాజా వార్త ఏంటంటే.. సుజిత్ తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ లోనే చేయనున్నట్టు తెలిసింది. ఇంతకీ ఎవరితో అంటే.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో అని సమాచారం. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ హీరో విక్కీ కౌశల్ అండ్ డైరెక్టర్ సుజిత్ కి మీటింగ్ ఏర్పాటు చేసిందట. రీసెంట్ గా సుజిత్ విక్కీ కౌశల్ కి కథ చెప్పడం జరిగిందట. అయితే.. ఈ కథ విక్కీ కౌశల్ కి నచ్చిందో లేదో తెలియాల్సవుంది. అంతా అనుకున్నట్టు జరిగితే.. సుజిత్ నెక్ట్స్ మూవీ బాలీవుడ్ లోనే ఉంటుంది.
Must Read ;- ది కంప్లీట్ యాక్టర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇదే.. !