కత్రినా కైఫ్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ నార్త్ లోనే కాకుండా.. సౌత్ లో కూడా బాగా ఫేమస్. తెలుగులో నందమూరి హీరో బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ భామకి సౌత్ లో అవకాశాలు వచ్చినా.. ఎందుకనో బాలీవుడ్ కే పరిమితం అయ్యింది తప్పా.. టాలీవుడ్ వైపు చూడలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, రణబీర్ లతో ప్రేమాయణం నడిపింది. ఆతర్వాత లవ్ స్టోరీకి బ్రేక్ అప్ చెప్పి.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది.
ఇదిలా ఉంటే.. ఈ బాలీవుడ్ బ్యూటీ త్వరలో సౌత్ లో ఓ సినిమా చేయబోతుందట. ఇంతకీ ఎవరితో అంటే.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో అని తెలిసింది. ఇంతకీ విజయ్ – కత్రినా కైఫ్ కాంబినేషన్ ని డైరెక్ట్ చేయబోయేది ఎవరంటే.. స్టార్ డైరెక్టర్ శ్రీరాఘవ అని సమాచారం. డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఇటీవల అందధున్ సినిమా తీసి కమర్షియల్ సక్సస్ సాధించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అందధున్.. మంచి నేమ్ ఫేమ్ తో పాటు అవార్డులు సైతం తెచ్చిపెట్టింది.
దీంతో శ్రీరాఘవ తదుపరి ఎవరితో సినిమా చేయనున్నాడు.? ఎలాంటి సినిమా చేయనున్నాడు..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. విజయ్ సేతుపతి సరసన నటించేందుకు కత్రినా ఓకే చెప్పడంతో… శ్రీరాఘవ ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత సౌత్ సినిమాలో నటిస్తుండడంతో బాలీవుడ్ లో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్పడిందట. మరి.. ఈ సినిమాతో కత్రినా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Must Read ;- కారు దిగి ఆటో ఎక్కిన దిశా పటాని