పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తయ్యింది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. రీసెంట్ గా పవన్ అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పడం.. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ తో కలిసి దగ్గుపాటి రానా నటించనున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మస్తుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ను జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా కంటే ముందుగా స్టార్ట్ చేసిన క్రిష్ మూవీ సంగతి ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ఇది భారీ పిరియాడిక్ మూవీ. దీనిని సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. కరోనా ముందు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకుంటే.. కరోనా వచ్చింది.
అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ ని జనవరిలో స్టార్ట్ చేయనున్నారని తెలిసినప్పటి నుంచి క్రిష్ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు. ఈరోజు పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారని తెలిసింది. దీంతో పుకార్లకు ఫుల్ స్టాఫ్ పడిందని చెప్పచ్చు. ఇక ఈ సినిమా కథ మొఘలాయిల కాలం నాటిదిగా చెబుతున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
Must Read ;- ‘వకీల్ సాబ్’ టీజర్ లో చూపించేది ఇదేనా?
#PSPK27 pic.twitter.com/IT2lUnqZEj
— Mega Surya Production (@MegaSuryaProd) January 11, 2021