చెన్నై లోని మహాలింగపురంలో భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నిన్నటితరం హీరోయిన వాణీ విశ్వనాధ్‌తో భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు వాణీ విశ్వనాధ్ ను ఆహ్వానిస్తున్నట్టుగా రెండు రోజులుగా పుకార్లు వస్తున్నాయి. అయితే పార్టీ వర్గాలేమీ వాటిని ధ్రువీకరించలేదు. అయితే సోము వీర్రాజు ప్రత్యేకంగా చెన్నై నగరంలో ఆమెతో భేటీ కావడంతో.. ఏపీ బీజేపీకి సినీ కలర్స్ అద్దడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అర్థం అవుతోంది.
ఒకప్పట్లో తెలుగుతేరను ఏలిన హీరోయిన్లలో వాణీవిశ్వనాధ్ కూడా ఒకరు. ప్రస్తుతం 49ఏళ్ల వయస్సున్న ఈ మళయాళ కుట్టి ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగించారు. ఒకప్పట్లో ఆమెను సినీనటి రోజా మీద పోటీచేయించడానికి టీడీపీ ప్రయత్నించింది కూడా. అయితే ఆమె యాక్టివ్ పార్టీ కార్యకర్తగా ఎన్నడూ లేరు.
ఇక బీజేపీ విషయానికి వస్తే.. కవిత వంటి మొన్నటితరం హీరోయిన్లు ఆ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు. అలాగే వాణీ విశ్వనాధ్ ను కూడా పార్టీలో చేర్చుకుంటే అదనపు బలం అవుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు ఎలాంటి ఆఫర్ ఆశచూపించి పార్టీలోకి స్వాగతిస్తారనే సంగతి తెలియడం లేదు.
అలాగే వాణీ విశ్వనాధ్ పార్టీలోకి వస్తే గనుక.. దగ్గర్లోనే రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె సేవలను పార్టీ వినియోగించుకుంటుందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నయి.
Must Read ;- తిరుపతి ఉపఎన్నికలో ఏసు, శ్రీకృష్ణుడి మధ్యే పోటీ : సునీల్ దేవధర్