సోనూ సూద్.. ఈ పేరు దాదాపు ఆరు నెలలుగా ట్రెండ్ అవుతోంది. పోనీ అతను సూపర్ స్టారా అంటే అదీ లేదు.. ‘వదల బొమ్మాళీ’ అంటూ అందరినీ భయపెట్టిన విలన్. కానీ దేశ వ్యాప్తంగా అతను హీరో అయిపోయుడు. తను చేస్తున్న సినిమా షూటింగులకు వెళితే చాలు స్వాగత సత్కారాలు లభించేస్తున్నాయి. అందరూ అతన్నో హీరోని చూస్తున్నట్టు చూస్తున్నారు. దీనికంతటికీ కారణం అతనిలోని దానగుణం. కరోనా కష్ట కాలంలో రోడ్డు పైకి వచ్చి వలస కార్మికులకు బస్సులు ఏర్పాటు చేసి ఇళ్లకు పంపడం మొదలు ఇప్పటిదాకా అతను చేసిన కార్యక్రమాలు ఒకటీ రెండూ కాదు.. ఎన్నో.
తను సంపాదించిన డబ్బున మంచి నీళ్లలా ఖర్చు చేయడానికి ఎందరు ముందుకు వస్తారు చెప్పండి. అతని ఖాతాలో ఇప్పుడు మరో కొత్త రికార్డు చేరింది. ట్విట్టర్ ఫాలోయింగ్ లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సూపర్ స్టార్ లను పక్కకు నెట్టేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. సోషల్ మీడియా అనలైటిక్స్ లో ఈ విషయం వెల్లడైంది. ఇండియాలో ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల జాబితాలో సోనూ సూద్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో మన భారత ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్థానంలో ఉన్నారు.
ఆ తర్వాత రాహుల్ గాంధీ, ఆ తర్వాత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉండగా నాలుగో స్థానంలో సోనూ చేరిపోయారు. కొంతకాలానికి మరింత ముందుకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంటే సినిమా స్టార్లంతా సోనూ వెనకే ఉన్నారన్న మాట. గూగుల్ సెర్చ్ లోనూ సోనూ పేరు ప్రధానంగా ఉంటోంది. ఇటీవల పంజాబ్ రాష్ట్రం ఐకాన్‌గా కూడా సోనూ నియమితుడయ్యాడు. మనిషిలోని ఈ దాన గుణం గొప్పతనం ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. మరి ఈ చిన్న లాజిక్ ను మన హీరోలు ఎందుకు మిస్సయ్యారో వారికే తెలియలి.
Must Read ;- కలలు కనేవారికి సోనూ భాయ్ సరికొత్త కానుక!