కోవిడ్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉండడంతో జనంలో వేక్సినేషన్ మీద శ్రద్ధ పెరిగిపోయింది. సామాన్య జనం వేక్సిన్ కోసం క్యూలు కడుతుంటే.. సినీ సెలబ్రిటీస్ ఒక్కొక్కరు వేక్సినేషన్ లో పాల్గొంటూ పబ్లిక్ లో దాని మీద మరింత అవగాహన కలిగిస్తున్నారు. కోలీవుడ్ విషయానికొస్తే .. రాధిక శరత్ కుమార్, సిమ్రాన్, కమల్ హాసన్, సుహాసిని లాంటి వారు ఇదివరకే వేక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా తలైవా రజనీకాంత్.. కోవిడ్ వేక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు.
ఇక ఈ లిస్ట్ లోకి కోలీవుడ్ ప్రేమ పక్షులు నయన్ తార, విఘ్నేశ్ శివన్ కూడా చేరారు. రీసెంట్ గా వీరిద్దరూ ఒకేసారి వేక్సినేషన్ తీసుకొని ఆశ్చర్యపరిచారు. నయన్ ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్త లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. విఘ్నేష్ శివన్ .. సమంతా, నయనతార , విజయ్ సేతుపతితో ‘కాదువాకుల రెండు కాదల్’ అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం కోవిడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడడంతో.. నయన్, విఘ్నేశ్ శివన్ ఇలా.. వేక్సినేషన్ తీసుకుంటూ.. వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి వేక్సినేషన్ ఫోటో .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- ప్రైవేట్ జెట్ లో మరోసారి ప్రేమ పక్షుల విహారం