తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన నాజూకు కథానాయికలలో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్‘ సినిమా ద్వారా తమలపాకు వంటి ఈ అమ్మాయి క్రితం ఏడాది ఎంట్రీ ఇచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా ఫరవాలేదనిపించుకుంది. కానీ కథానాయికగా కనిపించిన ప్రియాంక అరుళ్ మోహన్ నుంచి కుర్రాళ్లు చూపులు తిప్పుకోలేకపోయారు. తుమ్మెదల్లాంటి కళ్లు .. పల్చని పెదాలు .. మన్మథుడి మనసునే కొల్లగొట్టే మందహాసంతో తళుక్కున మెరిసిన ఈ సుందరిని చూసి ఆలోచనలో పడ్డారు. సన్నజాజులు .. మల్లెమొగ్గలు అసూయపడేలా వున్న ఈ సుకుమారి ఎవరంటూ ఆరాతీశారు.
కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న ఈ కుందనపు బొమ్మ, ఈ మధ్యనే కథానాయికగా తన కెరియర్ ను ఆరంభించింది. తెలుగులో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’తో పాటు ‘ఒందో కథ హెళ్లా’ అనే ఓ కన్నడ సినిమా కూడా చేసింది. గిరీశ్ గిరిజా జోషి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ కూడా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక అరుళ్ మోహన్ చేతిలో ‘శ్రీకారం’ అనే తెలుగు సినిమా .. ‘డాక్టర్’ అనే తమిళ సినిమా వున్నాయి. తెలుగులో నానీతో తొలి సినిమా చేసిన ప్రియాంక అరుళ్ మోహన్, నానీ తరువాత ఆ స్థాయి క్రేజ్ వున్న శర్వానంద్ తో రెండవ సినిమా చేయడం విశేషం.
Also Read ;- టాలీవుడ్ లోకి మరో బాలీవుడ్ బ్యూటీ?
కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘శ్రీకారం’ .. విడుదలకు ముస్తాబవుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ .. ట్రైలర్ .. లిరికల్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ప్రియాంక అరుళ్ మోహన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇక తమిళంలో ఈ అమ్మాయి చేసిన ‘డాక్టర్’ కూడా వచ్చే ఏడాదిలో థియేటర్స్ కి రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఆమె శివకార్తికేయన్ జోడీ కట్టింది. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాపై అక్కడ మంచి అంచనాలే వున్నాయి.
కెరియర్ తొలినాళ్లలోనే తెలుగు .. తమిళ .. కన్నడ భాషలను టచ్ చేసిందంటే అమ్మడు ఎంత తెలివైనదో అర్థమైపోతోంది. ఈ కారణంగానే ఈ పడుచు పాలరాతి శిల్పానికి మూడు భాషల నుంచి వరుసగా అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆమె తన జోరు పెంచనుందనీ, స్టార్ హీరోయిన్స్ రేసులోకి ఎంటరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Must Read ;- నగరంలో ఆ ఐదు థియేటర్స్ శాశ్వతంగా మూతపడ్డాయి… !