(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన రాములోరి శిరస్సు ఖండన అంశం…త్రిదండి చినజీయర్ పర్యటన తర్వాత మరింత ప్రాధాన్యత పెరిగింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట చినజీయర్ సూచనలతోనే ఆధునీకరిస్తున్నారు. తాజాగా ఏపీలో అదీ రామతీర్థం నీలాచలం కొండను సందర్శించిన చిన జీయర్..దేవతా మూర్తులను ఏడాది లోపు ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్టింప చేయాలని ఆదేశించారు.అలాగే దేవాలయాల్లో భక్తుల సంచారం, సీసీ కెమరాలు ఉండే విధంగా దేవాదాయ, పోలీసు శాఖలు చూసే విధంగా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తగు ఆదేశాలు ఇవ్వాలని చిన జీయర్ సూచించారు. చిన జీయర్ నీలాచలం కొండ వద్ద మీడియాతో మాట్లాడిన సుమారు ఏడుగంటల్లో అర్ధరాత్రి విజయనగరం జిల్లా ఎస్పీ అకస్మాత్తుగా దేవాలయాల వద్దకు వెళ్లి భద్రతను పరిశీలించారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన దొంగతనాలు, విగ్రహాల అపహరణ వంటి ఘటనలకు తోడు త్రిదండి చినజీయర్ సూచనలను పరిగణనలోకి తీసుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి నగరంలో ప్రముఖ దేవాలయాలను అర్ధరాత్రి పరిశీలించి… ఆలయ అర్చకులు, రాత్రి పూట గస్తి ,సీసీ కెమాల ఏర్పాటు, దేవాలయానికి రక్షణ వంటి అంశాలపై స్థానికులతో అక్కడికక్కడే చర్చించారు. ఏదైనా రామతీర్థం చినజీయర్ పర్యటనతో అటు దేవాదాయ శాఖ.. ఇటు పోలీసు శాఖ భద్రత, రక్షణ పట్ల శ్రద్ధ చూపెడుతున్నాయనే చెప్పక తప్పదు.
Must Read ;- 17 నుంచి ఏపీలో ధ్వంసమైన ఆలయాల సందర్శన : చినజీయర్ స్వామి












