మీరు ఎంత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించింది. వీటికన్నింటికీ స్వస్తి పలకాలంటే పోలీసుల ప్రవర్తనపై మూడో కన్ను నిఘా తప్పనిసరి అని తెలియజేసింది. అందులో భాగంగా, సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్లలోనూ సీసీకెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఇప్పటికీ భయమే
ఏ సమస్య వచ్చినా, ఏది పోగొట్టుకున్నా, వెంటనే గుర్తొచ్చేవారు పోలీసులు. వారికి ఫిర్యాదు ఇస్తే వాటిని తిరిగి పొందచ్చనేది సామాన్యుడి భావన. కానీ నేటికి కూడ పోలీసు స్టేషన్ గడప తొక్కాలంటే భయపడే వారు లేకపోలేదు. పోలీసులు ప్రవర్తన విషయంలో ఇప్పటికీ చాలా మందిలో అసంతృప్తి ఉంది. కొందరైతే పోలీస్ స్టేషన్ కి వెళ్లడానికి భయపడి పోయిన వస్తువును వదిలేసుకునే వారు లేకపోలేదు.
మీ ప్రవర్తన పై నిఘా అవసరం
పోలీసుల ప్రవర్తనపై సంచలనమైన వ్యాఖ్యలు చేసింది కోర్టు. అధికారం, డబ్బున్న వారికి కొమ్ముకాస్తూ…. సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు నిత్యం నమోదవుతున్నాయి. అంతేనా, కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి. లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా వ్యవహరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు పోలీస్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లెలా చేస్తుంది. వీటికి స్వస్తి పలకాల్సిన సమయం వచ్చింది.
ఏపిలో సంఘటనే అందుకు నిదర్శనం
కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతున్నాయి. ఏపీలో పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక దళితుడికి శిరోముండనం చేయించడం దేశమంతా తిలకించింది. పోలీసుల ప్రవర్తనను బహిరంగంగానే దుయ్యబట్టారు. ప్రజలు తప్పుగా ప్రవర్తిస్తే, వారిని సరైన మార్గంలో నడపాల్సిన పోలీసులే తప్పుదోవ పడుతున్న దాఖలాలు లేకపోలేదు. ఏకంగా పోలీసు స్టేషన్లోనే మద్యం తాగి పోలీసులే చిందులు వేయటం కూడా చూశాం.
పారదర్శకత అవసరం
నేరస్తులకు బుద్ధి చెప్పాలంటే, ముందు వారిని నియంత్రించే అధికారాలు చేపట్టిన పోలీసులు ప్రవర్తన పారదర్శకంగా ఉండడం చాలా అవసరం. మరి ఈ సమస్య తొలగాలంటే మీ ప్రవర్తన పోలీస్ స్టేషన్ లో ఎలా ఉందనే దానికి ఆధారం ఉండాలి. అందుకోసమే ఇక నుండి ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే సామాన్యుడికి కూడా కాస్త ధైర్యం లభిస్తుంది. అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేవలం ఈ ఆదేశాలు విని ఊరుకుంటే కుదరదు. దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.
Must Read ;- ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు : నిమ్మగడ్డా మజాకా?











