గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో “సీటీమార్” చిత్రాన్నిచేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రమిది. ఇందులో తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలారెడ్డిగా తమన్నా నటిస్తోంది. కాగా సోమవారం తమన్నాబర్త్‌డే సెలబ్రేషన్స్.ఈ చిత్రం సెట్లో ఘనంగా జరిగాయి. యూనిట్ సభ్యుల మధ్యన తమన్నా కేక్ కట్ చేసి తన ఆనందాన్ని వారితో పంచుకున్నారు.

.ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది, నటీమణులు భూమిక, దిగంగన సూర్యవంశీ తదితరులు పాల్గొని తమన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. బర్త్‌డేని పురస్కరించుకుని తమన్నాస్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో దిగంగన నటిస్తుండగా భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి.సినిమాటొగ్రఫీని ఎస్. సౌందర్ రాజన్, సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు.
Must Read ;- ఎఫ్ 3 లో మూడో హీరో విషయాన్ని తేల్చేసిన డైరెక్టర్











