TDP Chief Nara Chandrababu Naidu’s Tweet Reassured The Old Woman :
100 ఏళ్ల ముదుసలి, 80 ఏళ్ల వయసులోని ఆమె కుమార్తె. ఇద్దరికీ ఏ ఆసరా లేదు. కనీసం సొంతిల్లు కూడా లేదు. ప్రభుత్వం అందిస్తున్న పింఛనే వారికి ఆధారం. ఇద్దరు పింఛన్ కు అర్హులే కాబట్టి చాలా కాలం క్రితమే వారిద్దరికీ ప్రభుత్వ పింఛన్ మంజూరైంది. అయితే సంక్షేమ పథకాల అమలులో తమను మించిన ప్రభుత్వం లేదంటే గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారు.. ఇప్పుడు కోతలు మొదలెట్టేసింది కదా. ఈ కోతల్లో భాగంగా ఈ తల్లీకూతుళ్లు ఒకే రేషన్ కార్డు కలిగి ఉన్నారన్న కారణం చూపుతూ 80 ఏళ్ల కూతురి పింఛన్ ను జగన్ సర్కారు కోత కోసింది. దీంతో దిక్కుతోచని ఈ తల్లీకూతుళ్లు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అయితే గ్రామానికి చెందిన కొందరు యువకులు వీరి కష్టాన్ని వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. జగన్ సర్కారు దుర్మార్గాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. బాబు ట్వీట్ దెబ్బకు దిగొచ్చిన సర్కారు.. గతంలో మాదిరిగానే వారిద్దరికీ పింఛన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
కన్నీరు తెప్పించే కష్టం..
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన పువ్వుల రాఘవులు, తోరం సరస్వతి తల్లీకుమార్తెలు. అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సరస్వతి వయసు 80 ఏళ్లు కాగా, రాఘవుల వయసు వందేళ్లు. వీరిద్దరి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నాయి. ప్రతినెల వీరికి రూ. 2,250 చొప్పున పింఛన్లు అందించేవారు. ఆ సొమ్ముతోనే వారు జీవితాన్ని వెళ్లదీసేవారు. అయితే, ఒకే రేషన్ కార్డుపై ఒకరికే పింఛను అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన కారణంగా వీరికి వచ్చే పింఛను నిలిచిపోవడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఆరా తీస్తే లబ్ధిదారుల జాబితాల్లో వారి పేర్లు లేవని తెలిసి హతాశులయ్యారు. వీరి ఇబ్బందులు గమనించిన కొందరు యువకులు వారి బాధను వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇదే వీడియోను చంద్రబాబు కూడా షేర్ చేశారు.
ఇంతకంటే దారుణం ఉందా?
పింఛన్ లబ్దిదారుల పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా తయారైందని, అందుకు ఈ వీడియోనే నిదర్శనమంటూ చంద్రబాబు శుక్రవారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వృద్ధురాలి వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలోని వృద్ధురాలు తన గోడును వెళ్లబోసుకుంది. తమకు పెన్షన్ నిలిపివేశారని వాపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్థానిక వైసీపీ నేతలు విషయాన్ని మంత్రి శ్రీరంగనాథరాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్, డీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడి తల్లీకుమార్తెల పింఛన్లను పునరుద్ధరించారు. ఆ వెంటనే కార్యదర్శి, గ్రామ వలంటీరు వారి ఇంటికి వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు.
Must Read ;- మళ్లీ జగన్ బాదుడు.. జనం బెంబేలు