పాయల్ రాజ్ పుత్ .. ఆవుపాలతో చేసిన కోవాలా ఉంటుంది .. గోవా బీచ్ లో నిలబెట్టిన గంధర్వకన్యలా ఉంటుంది. పాయల్ మంచి పొడగరి .. అందుకు తగిన పర్సనాలిటీతో ఆమె రూపం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. తెలుగు తెరకి ఈ అమ్మాయి ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో పరిచయమైంది. తెరపై ఈ సుందరిని చూసిన కుర్రాళ్లు .. ఇంతటి అందం ఆకాశం నుంచి రాలిపడిందా? ఊహల్లో నుంచి ఊడిపడిందా? అనుకున్నారు. చూపులతో అభిషేకాలు చేసేసి .. ఆశతో ఆరాధనలు చేశారు. మది గదుల్లో ఆమె పోస్టర్లు అంటించేసుకుని అభిమాన గణంలో చేరిపోయారు.

పాయల్ రూపం సమ్మోహనం .. రొమాన్స్ ప్రధానంగా నడిచే సినిమాలకి .. సీన్స్ కి అవసరమైన కంటెంట్ ఆమె దగ్గర కావలసినంత ఉందని అభిమానులు భావించారు. ఆ తరహా కంటెంట్ ఉన్న కథల్లో ఆమె చెలరేగిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ ఎందుకో పాయల్ ఆశించిన స్థాయిలో దూసుపోవడం లేదు. తెర మోయలేని అందాలున్న ఈ బ్యూటీకి అవకాశాలు అంతంత మాత్రంగా ఉండటం ఆశ్చర్యపోవలసిన విషయమే. అమ్మడికి కాస్త లౌక్యం తక్కువే అనేమాట కూడా వినిపిస్తుందనుకోండి.

అయితే ఇక ఇది కాదు పని అన్నట్టుగా ఇప్పడు పాయల్ సోషల్ మీడియాలో తన దూకుడుకు తెరతీసింది. హాటు హాటు లుక్కులతో హీటు పెంచేస్తోంది. అందగత్తెతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందన్నట్టుగా ఒక్కో లుక్ వదులుతోంది. మల్లెలు .. మందారాలు కలిపి చేసినట్టుగా కనిపించే ఈ సుందరి అందంతోనే ఆవిర్లు చిమ్ముతూ ఉండటంతో, కుర్రాళ్లంతా ఏసీలు ఆన్ చేసుకుని మరీ చూస్తున్నారు. పాయల్ గ్లామర్ ధాటికి వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే, ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగేసి చూడటం కూడా మంచి ఫలితాన్నే ఇస్తుందనేది మరికొందరి మాట.
Must Read ;- పూజా హెగ్డేతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి!











