RX100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయి , యువ హృదయాలు కొల్లగొట్టిన అందాల తార పాయల్ రాజపుత్ కి లక్ కలిసి రావడం లేదు. వెంకటేష్ సరసన ‘ వెంకీ మావ ” సినిమాలో, రవితేజతో ” డిస్కో రాజా ” లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. హీరోయిన్ ప్రధాన పాత్రలో “RDX ” సినిమా చేసినా, ‘ అనుకోని అతిధి ” సినిమా చేసినా కలిసి రాలేదు. డైరెక్టర్ గుణశేఖర్ కో డైరెక్టర్ ప్రణదీఫ్ తనే నిర్మాతగా మారి ,-W5 ” అనే సినిమా తీశారు . పాయల్ రాజపుత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది.
ఈ సినిమా పూర్తి అయి , చాలా కాలం అయినా విడుదలకి నోచుకోలేదు . ఇప్పుడు మళ్ళీ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతుంది పాయల్ రాజపుత్. గోపి గణేష్ డైరెక్షన్ లో సత్యదేవ్ హీరోగా రాబోతున్న ” గాడ్సే” లో ఒక హీరోయిన్ గా పాయల్ రాజపుత్ నటించబోతుంది. యాక్షన్ ప్రధానం గా సాగే ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Must Read ;- అను ఇమ్మాన్యుయేల్ కి, మరో ముద్దుగుమ్మకి పోలికలా? అవేంటి?