ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నను ఎవరిని అడిగినా, తడుముకోకుండా చెప్పే పేరు పూజా హెగ్డే. వెండితెరపై బంగారు చేపలా తళుక్కున మెరిసే ఈ బ్యూటీకి, విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆమె తనదైన రీతిలో సమాధానాలు చెబుతూనే ఉంటుంది. అలాంటి పూజా హెగ్డే ‘దువ్వాడ జగన్నాథం‘ సినిమాలో స్విమ్మింగ్ పూల్ సీన్లో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ సీన్లో ఆమెను చూసిన కుర్రాళ్లకు, ఆ తరువాత కొంతసేపటివరకూ కథ అర్థంకాలేదంటే ఒట్టు.
అంతగా బికినీ సీన్లో పూజా హెగ్డే మతులు పోగొట్టేసింది. సోషల్ మీడియాలో ఆమె బికినీ పిక్ చూసిన ఒక అభిమాని, ‘అరవింద సమేత’ నుంచి ఒక మంచి ఫోటోని షేర్ చేయమని అడిగాడు. దాంతో ఆమె ఆ సినిమా షూటింగు సమయంలో ఎన్టీఆర్ తనయుడు ‘అభయ్ రామ్‘ దిగిన ఫొటోను పెట్టేసి అతగాడికి షాక్ ఇచ్చింది. అంతేకాదు కాస్త అతి చేసిన మరో అభిమానికి ఆమె దిమ్మతిరిగే రీతిలో సమాధానం ఇచ్చింది. ఒక యువకుడు ఆమె నేక్డ్ ఫొటో పెట్టమని అడగ్గా, ఆమె మురికి పాదాల ఫొటోను షేర్ చేసి బిత్తరపోయేలా చేసింది.
తెరపై తెరపై ముద్దుముద్దుగా పెదాలను కదిలిస్తూ, అందంగా కనిపించే హీరోయిన్లు అమాయకులని భావించే కొందరు కుర్రాళ్లు ఇలాంటి అతి తెలివితేటలు చూపిస్తుంటారు. తెల్లారితే హీరోయిన్లు చకచకా ఫ్లైట్ లు మారుతూ దేశ దేశాలు తిరుగుతారనీ, వివిధ రకాల భాషల్లో వివిధ రకాల మనస్తత్వాలు కలిగినవారితో కలిసి పనిచేస్తూ ఉంటారనే విషయాన్ని గ్రహించాలి. అందువలన ఇతరులకంటే మనుషులను వాళ్లు మరింతగా చదివే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటప్పుడు వాళ్లు తిన్నగా ఎలా సమాధానం చెబుతారు? ప్రస్తుతం పూజా హెగ్డే ఇటు తెలుగులో .. అటు హిందీలో భారీ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది.
Must Read ;- బుట్టబొమ్మ మెచ్చిన బామ్మ.. ఎందుకంట?