సుప్రసిద్ధ నేపధ్య గాయకుడు తెలుగుతో పాటు పలు భారతీయ భాషలలో తన గళ మాధుర్యంతో అలరించిన ఎస్పీ.బాలసుబ్రమణ్యం కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ కారణంగా సెప్టెంబర్ 25 న చెన్నైలో కన్నుమూశారు. తొలుత ఆయనకు కరోనా సోకింది. దాని నివారణ నిమిత్తం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులపాటు చికిత్స పొంది, కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక అదే నెల సెప్టెంబర్ 8న కార్డియాక్ అరెస్ట్ కారణంగా నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. విలన్ పాత్రలలో ఎంత కర్కశం చూపించగలరో హాస్య పాత్రలలో కూడా తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడాయన. రాయలసీమ మాండలికంలో అద్భుతంగా డైలాగ్ లను పలికించి ఓ ట్రెండ్ సృష్టించారు కూడా. ఆయన ఆకస్మిక మరణం టాలీవుడ్ కు తీరని దుఃఖాన్నిమిగిల్చింది.
అలాగే మరో ,సీనియర్ నటుడు రావి కొండలరావు కూడా కార్డియాక్ అరెస్ట్ కారణంతోనే ఈ ఏడాది జూలై 28న తుదిశ్వాస విడిచారు. కొండలరావు నటుడు మాత్రమే కాదు మంచి రచయిత, దర్శకుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. తెలుగు సాహిత్యానికి ఆయన ఎనలేని కృషి చేశారు. అలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటుడిగా పేరుపొందిన కోసూరి వేణు గోపాల్ కరోనా చికిత్స పొందుతూ సెప్టెంబర్ 23న కన్నుమూశారు. బుల్లితెరపై పేరు తెచ్చుకుని వెండితెరపై అరంగేట్రం చేసిన వేణుగోపాల్ “మర్యాద రామన్న, పిల్ల జమీందార్, ఛలో” తదితర చిత్రాలలో ఎలాంటి చక్కటి నటనను ప్రదర్శించారో తెలియంది కాదు. ఇక బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన వర్ధమాన నటి కొండపల్లి శ్రావణి సెప్టెంబర్ 8న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కూడా తెలుగు సినీరంగంలో విషాదాన్ని నింపింది. ఇలా పలువురు సినీ ప్రముఖులను 2020 కోల్పోయి టాలీవుడ్ కు తీరని నష్టాలను మిగిల్చింది.
Must Read ;- టాలీవుడ్ హీరోలకు విలన్ కష్టాలు.. !











