ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అన్ని షోలకు ‘జబర్దస్త్’ షోనే కింగ్ అని చెప్పొచ్చు. గత 7సంవత్సరాల నుండి నాన్ స్టాప్ గా నడుస్తోన్న ఈ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతోంది. ‘జబర్దస్త్’లో ఎంతమంది టీం లీడర్లు ఉన్నా అందులో రాకింగ్ రాకేష్ మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. తన టీంలో ఉన్న ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్‌ల తోనే ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటాడు రాకేష్. టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులను అంతగా నవ్వించే రాకేష్ జీవితం వెనకాల ఎన్నో కష్టాలు, నష్టాలు ఉన్నాయి. అవి ఏమిటో ఆయన మాటల్లోనే విందాం..
*మా స్వస్తలం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం. శ్రీవాణి విద్యామందిర్ లో 10వ తరగతి వరుకు చదువుకున్నాను. ఆ తర్వత వివేకానంద జూనియర్ కాలేజిలో జాయిన్ అయ్యాను. అక్కడి నుండి డిగ్రీ చదవడానికి కాకతీయ యూనివర్సిటీలో చేరాను. డిగ్రీ అయిన వెంటనే మిమిక్రీ ఆర్టిస్ట్ అవుదామని హైదరాబాద్ కు వచ్చేసాను. అనేక కష్టాలు పడి ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాను. ‘జబర్దస్త్’కు రాకముందు అనేక స్టేజి షోలను చేశాను. కొన్ని ఛానెల్స్ లో కూడా మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేశాను. ఆ తర్వాత అవకాశాలు పెరిగి వేరే దేశాల్లో ప్రోగ్రాం చేసేవాడిని. అలా షోస్ చేసుకుంటూ ఉన్న సమయంలో ధనరాజ్ అన్న పరిచయం అయ్యాడు.
*ధనరాజ్ సహాయంతో నేను ‘జబర్దస్త్’ లోకి అడుగుపెట్టాను. ధనరాజ్ అన్న అంటే నాకు ఒక పెద్దన్న లాగా. ఏదైనా ఉంటే ముందు ధనరాజ్ కే చెప్తాను. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆయనతోనే షేర్ చేసుకుంటాను. ఇక ఇప్పుడు నేను చేస్తున్న ‘జబర్దస్త్’ షోలో ప్రతీ టీం లీడర్ కు ఒక్కోరకమైన టాలెంట్ ఉంది. అందరిలాగే నేను కూడా కామెడీ చేస్తే పెద్దగా గుర్తింపు వస్తుందో రాదో అని అనుకున్నాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని నా స్కిట్ లను చిన్న పిల్లలతో చేయడం స్టార్ట్ చేశాను.
*పిల్లలతో స్కిట్ చేస్తుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొదట్లో పిల్లలతో స్కిట్స్ బాగా వస్తాయో లేదో అని అనుకున్నాను. కాని వారు అద్భుతంగా స్టేజీపై నటిస్తున్నారు. వారి వలన నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు పిల్లలతో 300 స్కిట్లు చేశాను. అన్నీ మంచి విజయం సాధించాయి. ‘జబర్దస్త్’ అనేది నా జీవితాన్ని మార్చేసింది. ఈ షో వలనే నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి.
* ‘జబర్దస్త్’ నాఒక్కడికే కాకుండా చాలా మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. ప్రతీ ఒక్కరు తన జీవితంలో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ పడతారు. అలాగే నేను కూడా ఆశ పడ్డాను. కాని ఆ ఆశను ఎలా నెరవేర్చుకోవాలో తెలియదు. మనం ఆఫర్స్ కోసం అనేక మంది పెద్దవారిని కలుస్తాం. వారికి మనం మంచిగా కనపడాలి. అలా కనపడాలంటే మంచి బట్టలు, షూస్ కొని వేసుకోవాలి. సంపాదిస్తున్న డబ్బులన్ని వాటికే ఖర్చుపెట్టాల్సి వచ్చేది. ఇంక ఎలా నా కోరికను తీర్చుకోవాలి అని అనుకునే వాడిని. నాకు వచ్చిన డబ్బుల్లో ఒక్కొక్క రూపాయి దాచుకునేవాడిని. ఆ దాచిన డబ్బులతో గ్రేటర్ కమ్యూనిటీలో ఒక ఇల్లు కొన్నాను.
Also Read ;- బిగ్ బాస్ హౌస్ లో ‘ప్రేమించుకుందాం రా’ సినిమా
*మా అమ్మకు కూడా చెప్పలేదు. ఆ ఇల్లు మొత్తం పనులు పూర్తయిన తర్వాత మా అమ్మను తీసుకువెళ్లి చూపించాను. ఎవరి ఇల్లు రా ఇది అని అమ్మ అడిగింది, మన ఇల్లే అమ్మ అని చెప్పాను. చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ కన్నా ముందు నాగబాబు సార్ కి, మా తోటి ఆర్టిస్టులకు తెలుసు. వాళ్ళ సలహాలు, సూచనలతోనే నేను ఇల్లు కొన్నాను. ముఖ్యంగా నాగబాబుగారు ఇల్లు కొనే విషయంలో బాగా సహాయం చేశారు. అంత పెద్ద ఇల్లు నేను కొనగలనా సార్ అన్న సమయంలో ఏమి కాదు కొను, నీకు ఇంకా మున్ముందు మంచి భవిషత్ ఉంది. ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఏంపర్వాలేదు కొనే అని అన్నారు నాగబాబుగారు. వెంటనే దైర్యం చేసి కొనేశాను.
*నాగబాబుతో పది నిముషాలు మాట్లాడితే చాలు భవిషత్ లో ఎన్నో సాధించగలం అని అనిపిస్తుంది. ‘జబర్దస్త్’ లో నాగబాబుగారు లేకపోయినా ఇప్పటికీ మేము ఫోన్ చేస్తే నాన్న చెప్పరా అని ప్రేమగా మాట్లాడుతారు. మేము నాగబాబుగారి దగ్గర కొంచెం అయినా భయపడతాము కాని రోజాగారి దగ్గర చాలా ఫ్రీగా ఉంటాము. మేమందరం ఆమె దగ్గర బాగా అల్లరి చేస్తాం.
*మమ్మల్ని చిన్న పిల్లలుగా చూస్తారు రోజాగారు. నేనైతే ఆమెను అమ్మ అని పిలుస్తాను. నా పట్ల చాలా ప్రేమగా ఉంటారు రోజాగారు. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే నా జీవితంలో ప్రేమ అనేది ఒక మురికి గుంటలాంటిది. ఈ జనరేషన్ నుండి లవ్ అనేది చిన్న ఎమోషన్ లా తీసుకోవడం మంచిది. అమ్మాయిలందరూ అలా ఉంటారని నా అభిప్రాయం కాడు. ప్రేమను 99% సీరియస్ గా తీసుకున్న అబ్బాయిలు ఉన్నారు కాని 99% సీరియస్ గా తీసుకొనే అమ్మాయిలు ఈ రోజుల్లో లేరు. నాకు తగిలిన అనుభవాలు అనువంటివి. నవ్వించే వారిని ఎప్పుడు జోకర్ లాగే చూస్తుంటారు.
Must Read ;- ప్రేమవ్యవహారంపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్
రాకింగ్ రాకేశ్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియో లో చూడండి.











