తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీల వల్ల చిన్న సినిమాలకు ఒరిగిందేమీ లేదని తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్..యేలూరు సురేందర్ రెడ్డి.తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినీరంగానికి రాయితీల వర్షం కురిపించిందని అని పరిశ్రమలోని కొందరు చంకలు కొట్టుకుంటున్నారు. దీని వెనుక పెద్ద లాబీయింగే జరిగినట్లు అర్థమవుతోందని ఆయన ఆరోపించారు.
చిరంజీవి, నాగార్జునలకు ఎంతమాత్రం చిన్న నిర్మాతలు కనిపించడం లేదని అనిపిస్తోందని అన్నారు. పెద్ద హీరోలు, అలాగే లీజు థియేటర్ల వాళ్లు .లాబీయింగ్ చేసి, వాళ్లకు ఏమికావాలో అది చేసుకున్నారు. .10 కోట్ల లోపు చిన్న సినిమాలకు జీఎస్టీ రీ ఎంబర్స్ మెంట్ అన్నారు. అసలు పదికోట్ల సినిమాను ఎక్కడైనా చిన్న సినిమాగా వ్యవహరిస్తారా? .వాస్తవానికి చిన్న సినిమా అంటే రెండు నుంచి మూడు కోట్ల లోపు బడ్జెట్ మాత్రమే పెట్టుబడి పెట్టిన వాటినే అంటారు. అయినా ఇంత తక్కువ బడ్జెట్లో తీసిన చిన్న సినిమాలకు జీఎస్టీ నెంబరే ఉండదని ఆయన పేర్కొన్నారు.
ఏడాదిలో వచ్చే రెండువందల సినిమాల్లో పెద్ద సినిమాలు ఓ 20 నుంచి 30 వరకు మాత్రమే ఉంటాయి. .మిగతా 170 నుంచి 180 వరకు చిన్న సినిమాలే. పరిశ్రమకు కొత్త నటీనటులను, కొత్త సాంకేతిక నిపుణులను తీసుకుని వచ్చేవి చిన్న సినిమాలే. పైపెచ్చు సామాజిక సృహ ఉన్న చిత్రాలను తీసేది ఈ చిన్న నిర్మాతలేనని ఆయన వివరించారు. అంతేకాదు దాదాపు 30 వేల మంది కార్మికులకు పనిపనికల్పించేది ఈ 180 చిత్రాల చిన్న నిర్మాతలేనని ఆయన స్పష్టం చేశారు అలాంటి చిన్న సినిమాలు తీసే నిర్మాతల నోట్లో మట్టి కొట్టారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. చిన్న చిత్రాల నిర్మాతలమైన తాము అడిగినవి మూడే మూడు.థియేటర్లలో 2 గంటల షో తప్పనిసరిగా చిన్న సినిమా ప్రదర్శన ఉండాలని కోరుతున్నాం.
అలాగే ప్రభుత్వ లొకేషన్లకు డబ్బులు చెల్లించకుండా ఉచితంగా లొకేషన్స్ ఇవ్వమని అడిగాం. ఇంకా .థియేటర్లలో సినిమా ప్రదర్శన కోసం డిజిటల్ ప్రొవైడర్స్ వారానికి 12,000 వేల రూపాయలు అన్యాయంగా వసూలు చేస్తున్నారని,.దానికి పరిష్కారం చూపమని చాలాకాలంగా కోరుతున్నాం. చిన్న సినిమాల నిర్మాతలు ఎంతోకాలంగా అడుగుతున్న వీటన్నింటినీ పక్కన పెట్టేశారు. పరిశ్రమ అంటే కేవలం 20 లేదా 30 పెద్ద సినిమాలు కాదు, 180 చిన్న సినిమాలు ఉన్నాయని వివరిస్తూ, ఆ .180 నిర్మాతల శాపనార్థాలు మీకు తగలకుండా చూసుకోండని ఆయన అన్నారు. మొత్తం మీద పెద్దవాళ్లు వెళ్లి…వారికి కావలసిన లాబీయింగ్ చేసుకున్నారు అంటూ సురేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Must Read ;- సీఎం కేసీఆర్ కు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ధన్యవాదాలు