రాష్ట్రంలో నిలిచిన 7 లక్షల టిడ్కో ఇళ్లు!
ఏపీలో తెలుగుదేశం పార్టీ హయంలో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు 7 లక్షల గృహాలను మంజురు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అర్బన్ ఏరియాలో వీటిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేసి శరవేగంగా నిర్మాణాలు చేపట్టారు. వీటిని టిడ్కో సంస్థ నిర్మాణాలు చేపట్టింది. ఇందులో 4 లక్షల 45 వేల ఇళ్లును ఏడాది కాలం లోపే నిర్మించి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు కూడా చేయించారు. మరో 3 లక్షల పైచిలుకు గృహాలు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. వీటన్నింటిని జగన్ రెడ్డి కుట్రపూరితంగా నిలిపివేశి, లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందుకుల గురిచేేస్తున్నారు. లబ్ధిదారుడుకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లు గడిచిన రెండునరేళ్లుగా నిలిపివేసి పైశాచి ఆనందాన్ని పొందుతోంది అధికార పార్టీ. 2014 నుంచి 2018 నవంబర్ వరకు 20,18,390 ఇళ్లు ముంజూరు చేయగా .. 7,53, 697 గృహాల నిర్మాణం పూర్తి చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఈ నేపధ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సోమవారం కుటుంబ సమేతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన అందరికీ సొంత ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి పేదలకు ఇళ్లు లేవు .. సొంతగా ఇళ్లు నిర్మించేందకు బిల్లు లేదని ఎద్దేవా చేశారు. నాడు పాదయాత్రలో టిడ్కో ఇళ్ళు పూర్తి ఉచితంగా ఇస్తామని చెప్పి .. నేడు బ్యాంకుల్లో రుణాలు తీసుకోమని లబ్ధిదారుడని బెదిరిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ‘నా ఇల్లు నా సొంతం’ అన్న నినాదంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, టిడ్కో ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని రామానాయుడు హెచ్చరించారు..
Must Read ;- జీవితంలో ఇటువంటి ఎంపీలకు ఓటు వేయ్యొద్దు.. !











