పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తమ అభిమాన హీరో రీ ఎంట్రీ మూవీ కావడంతో బాక్సాపీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుందని.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ వస్తాడనుకున్నారు కానీ.. రావడం లేదు. కారణం ఏంటంటే.. థియేటర్లు ఇప్పుడు రీ ఓపెన్ చేశారు. జనాలు థియేటర్లకి వస్తారో రారో అనేది ఒక కారణం అయితే.. విదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది.
అక్కడ మళ్లీ లాక్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అందుచేత సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ రిలీజ్ చేస్తే.. ఓవర్ సీస్ లో రిలీజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అలా చేస్తే.. భారీ బడ్జెట్ తో రూపొందిన ‘వకీల్ సాబ్’ కు లాభాలు రావు. చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకనే ‘వకీల్ సాబ్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఇదిలా ఉంటే.. అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అని అఫిషియల్ గా ప్రకటించారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సైటెంట్ అయ్యాడు. ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే.. చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా సైలెంట్ అయ్యింది. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. మరి.. సంక్రాంతికి రావాలనుకున్న అఖిల్, నితిన్ సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటో..? ఎప్పుడు తమ సినిమాలను రిలీజ్ చేస్తారో.? త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- నితిన్ టీమ్ ప్లాన్ అదిరింది.. ఏంటా ప్లాన్..?











