ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. అందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతో అప్రమత్తతో ఉండాల్సిన టైమిది. అలాగే.. బాధితులు ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా.. ఎంతో పాజిటివ్ గా ఉంటేనే నెగెటివ్ థాట్స్ ను పారద్రోలి.. దాన్నుంచి బైటపడవచ్చు. అందరిలోనూ ఈ అవేర్ నెస్ కలిగించడానికి ఒకొక్కరూ ఒకో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే హాలీవుడ్ హాటీ సల్మా హయక్ మాత్రం తన బికినీ విందుతో అలాంటి వారికి సేద తీర్చుతానంటోంది.
అందాలు ఆరబోయడంలో హాలీవుడ్ బ్యూటీస్ ముందు వరుసలో ఉంటారని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య కరోనా కల్లోలంలో కూడా కొందరు బ్యూటీస్ బికినీ ట్రీట్స్ తో నెటిజెన్స్ ను కవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు సల్మా హయక్ కూడా చేరింది. ఈ బ్యూటీ వరుస బికినీ సెల్ఫీలతో నెటిజెన్స్ కి ఊపిరి సలపనివ్వడం లేదు. ఐదుపదుల వయసులో కూడా ఏమాత్రం తగ్గని హాట్ నెస్ తో ఇన్ స్టా గ్రామ్ ను అల్లాడిస్తోంది.
తనకున్న అందాల్ని బహిర్గతం చేయడానికి తాను ఏమాత్రం సిగ్గుపడనని చెబుతున్న సల్మా హయక్.. ఇలాంటి ఫోట్స్ ను షేర్ చేయడాన్ని ఆపనని .. దీన్ని ఒక ఉద్యమంగా కొనసాగిస్తానని చెబుతోంది. 17 మిలియన్స్ పైగానే ఉన్న తన ఇన్ స్టా ఫాలోవర్స్ ను వరుసగా హాట్ బికినీ షోస్ తో అలరిస్తానంటోంది. అంతేకాదు.. ప్రస్తుతం కరోనాతో క్వారంటైన్ లో ఉన్నవారికి తన బికినీ షో ఎంతగానో రిలీఫ్ ఇస్తుందని చెబుతోంది. రెండువారాలకు ఒకసారి తననుంచి స్పెషల్ ట్రీట్ ఉంటుందని చెబుతోంది.
Must Read ;- త్రోబ్యాక్ బికినీ ఫోటోతో హీటెక్కించిన షామా సికందర్