సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హైదరాబాద్ లో ‘రాధే శ్యామ్‘ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ముంబయికి తిరిగి వచ్చింది. ముంబయి ప్రయాణం అయిన కొన్ని గంటల ముందు తనకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూజా టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలలో నటిస్తోంది. అందుకే ‘రాధే శ్యామ్‘ షూటింగ్ ముగించుకొని ఇక్కడి సినిమా షూటింగ్ నిమిత్తం ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విమానాశ్రయంలో ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆమె వెంట పడుతూ ఫోటోలు తీయడానికి ఎగపడ్డారు.
సార్టోరియల్ ఫ్యాషన్ ను ఎక్కువగా ఇష్టపడే పూజా తను వేసుకున్న దుస్తులలో హాట్ గా కనిపించింది. తెలుపు రంగు టాప్ ధరించి దానిపై పింక్ జాకెట్ వేసుకుంది. దీనికి మ్యాచింగ్ గా బ్లూ జీన్స్ ధరించింది. ఇక కాళ్లకు తెలుపు రంగు బూట్లు, చేతిలో గోధుమ రంగు హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఒక ఫ్యాషన్ ఏంజిల్లా కనిపించింది. అలాగే కరోనా నిబంధనలకు అనుగుణంగా .. ముదురు గోధుమ రంగు మాస్క్ ధరించి ముంబయి ఎయిర్ పోర్టులో నుండి బయటకు వచ్చింది.
దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూజా తెలుగులో ‘రాధే శ్యామ్’ తో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో అఖిల్ సరసన నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది. ఇక బాలీవుడ్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించబోయే ‘పైప్‌లైన్’ లో పూజాకు అవకాశం దక్కింది. ఇందులో ఆమెతో పాటు రణ్‌వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు.
Must Read ;- ముంబయి ఎయిర్ పోర్టులో మెరిసిన బాలీవుడ్ క్రేజీ పెయిర్