బిఫోర్ లాస్టియర్ మహేశ్ బాబు ‘మహర్షి’ లో మంచి పాత్ర పోషించిన తర్వాత అల్లరి నరేశ్ నుంచి మరో సినిమా విడుదల కాలేదు. అయితే మహర్షిలోని పాత్ర తెచ్చిపెట్టిన క్రేజ్ వల్లనో ఏమో కానీ.. నరేశ్ కామెడీ నుంచి కాస్తంత పక్కకి జరిగి.. ‘నాంది’ అనే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీతో నటుడిగా సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ.. దీని కన్నా ముందు అతడు నటించిన ‘బంగారు బుల్లోడు’ అనే కామెడీ మూవీ మాత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. నరేశ్ ఔట్ అండ్ ఔట్ కామెడీ పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి హైలైట్ కానుంది. పి.వీ గిరి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ను జనవరి 23న విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖాయం చేశారు. ఈ విషయాన్ని నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేశారు.
రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్స్ తో ‘బంగారు బుల్లోడు’ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. పూజా ఝవేరి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా లో నరేశ్ ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో ఎంప్లాయీగా నటిస్తుండగా.. ‘అజయ్ ఘోష్’ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టబోతున్నాడు. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో జరిగిన రోబరీ కేస్ ను పరిష్కరించడానికి బరిలోకి దిగిన ఓ పోలీసాఫీసర్ కు ఎదురైన ఎక్స్పీరియెన్స్ .. జరిగిన సంఘటనలు కామెడీ వేలో ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు గిరి. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇంకా పోసాని, వెన్నెల కిషోర్, ప్రధ్వీరాజ్ తదితర కామెడియన్స్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి బంగారు బుల్లోడుగా అల్లరోడు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
Must Read ;- ఎఫ్ 3 కోసం రంగంలోకి దిగిన వరుణ్ తేజ్
Maa bangarubullodu vachesthunnadu. Lets extend the festival season this time. https://t.co/tXxPZ9qT6E
— Anil Sunkara (@AnilSunkara1) January 12, 2021