నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య – బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఉంటాయి. అయితే.. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పవర్ ఫుల్ స్టోరీతో బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2021 సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. బాలయ్యతో బ్లాక్ బస్టర్స్ అందించిన సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నారు. స్టోరీ రెడీ చేయడం.. బాలయ్యకి చెప్పి ఓకే చేయించుకోవడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. మరో వైపు బాలయ్యతో డిక్టేటర్ మూవీని తెరకెక్కించిన శ్రీవాస్ కూడా బాలయ్య కోసం కథ రెడీ చేసారని.. ఈ కథకు కూడా బాలయ్య గ్రీన్ ఇచ్చారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పైసా వసూల్ తర్వాత బాలయ్యతో మరో సినిమా చేయాలనుకున్నారు. బాలయ్య కూడా పూరితో మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. పూరి, శ్రీవాస్, బి.గోపాల్… వీళ్లల్లో ఎవరితో ముందుగా సినిమా చేస్తారనుకుంటుంటే.. ఇప్పుడు మరో డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ.. ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా..? రామ్ తో కందిరీగ, హైపర్ చిత్రాలను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్నారు.
ఎ.కె. ఎంటర్ టైన్మెంట్ సంస్థకు సంతోష్ శ్రీనివాస్ కథ వినిపించడం జరిగిందని తెలిసింది. ఈ కథ బాలయ్యకు కరెక్ట్ గా సరిపోతుందని.. త్వరలో బాలయ్యకు వినిపించే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. ఈ మూవీకి బలరామయ్య బరిలోకి దిగితే.. అనే టైటిల్ కూడా రిజిష్టర్ చేయించినట్టు సమాచారం. ఈ టైటిల్ బయటకు రాగానే.. బాలయ్యకు కరెక్ట్ టైటిల్.. ఈ టైటిల్ అదిరింది అంటున్నారు. మరి.. బాలయ్య.. బోయపాటితో చేస్తున్న మూవీ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.
Must Read ;- బాలయ్య, ఈటెల మాటలు అలా.. కరోనా వ్యాక్సిన్ ఇంకెలా?











