ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డు స్ధాయి కలెక్షన్స్ తో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే.. బుచ్చిబాబు తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నాన్నకు ప్రేమతో.. సినిమా షూటింగ్ టైమ్ లోనే బుచ్చిబాబు ఎన్టీఆర్ కు కథ చెప్పారు. ఈ కథ ఎన్టీఆర్ కు నచ్చిందని.. అందుచేత బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ తోనే ఉంటుందని గట్టి గా వినిపించింది.
తాజా వార్త ఏంటంటే.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ ఉంటుందని.. ఎన్టీఆర్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఇది పూర్తైన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయి కంప్టీట్ కావడానికి టైమ్ పడుతుంది కనుక ఈ గ్యాప్ లో మరో సినిమా చేసుకోమని చెప్పారట. ఎన్టీఆర్ అలా చెప్పడంతో బుచ్చిబాబు ఓ స్టోరీ రెడీ చేసి అక్కినేని అఖిల్ కి చెప్పాడని తెలిసింది. ఈ కథ నాగార్జునకు, అఖిల్ కి బాగా నచ్చిందని సమాచారం.
అఖిల్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నట్టు తెలిసింది. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయాల్సివుంది. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని జూన్ 19న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. సురేందర్ రెడ్డితో చేస్తున్న సినిమాతో పాటే బుచ్చిబాబుతో సినిమా కూడా చేస్తాడో.. లేక సురేందర్ రెడ్డితో సినిమా కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబుతో సినిమా చేస్తాడో తెలియాల్సివుంది.
Must Read ;- నక్కతోక తొక్కిన ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు