నందమూరి నటసింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేసేందుకు సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్, పూరి జగన్నాథ్, శ్రీవాస్ రెడీగా ఉన్నారు. వీళ్లల్లో ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ బాలయ్యతో సినిమా చేయనున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు. డిసెంబర్ 9న అంటే నేడు సి.కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సి.కళ్యాణ్ తను చేయబోయే సినిమాల గురించి ప్రకటించారు.
బాలయ్యతో ఓ సినిమా చేయనున్నాను. సి.కె. ఎంటర్ టైన్మెంట్ సంస్థ అంటే బాలయ్య తన సొంత నిర్మాణ సంస్థలా ఫీలవుతుంటారు. నేను ఆయన ఇంటి ప్రొడ్యూసర్ లా ఫీలవుతుంటాను. ఆయనతో సినిమా చేయడం అంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు. అలాగే డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తో కూడా సినిమా చేయనున్నాను అని చెప్పారు. గతంలో బాలయ్యతో సి.కళ్యాణ్ జై సింహ, రూలర్ సినిమాలను నిర్మించారు. బాలయ్యతో మరో సినిమా చేయాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
డైనమిక్ డైరెక్టర్ వినాయక్ ని తీసుకెళ్లి బాలయ్యకు కథ చెప్పించారు. కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ పై వినాయక్ వర్క్ చేసారు. అయితే.. సరైన కథ సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు సి,కళ్యాణ్ బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేయిస్తున్నారు. స్టార్ రైటర్ బాలయ్య కోసం స్టోరీ రెడీ చేస్తున్నారు. కథ రెడీ కాగానే.. బాలయ్యతో సినిమాని ప్రకటిస్తారని సమాచారం. మరి.. బాలయ్యతో సి.కళ్యాణ్ నిర్మించే సినిమాకి దర్శకుడు ఎవరు అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Must Read ;- పవన్ కోసం స్టోరీ రెడీ చేసిన స్టార్ రైటర్.?