బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే..
మంత్రి సీదిరి అప్పలరాజు నోటి దురుసు ఏపీ వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి! నిన్న విశాఖ కేంద్రంగా అరిలోవ సీఐ రాజుల నాయుడుపై మంత్రి తననోటితోనే కాదు చేతులతో కూడా పని చెప్పాడు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ హాజరైన సందర్బంలో శారదా పీఠంలోకి అనుచరులతో ప్రవేశిస్తున్న మంత్రిని సీఐ రాజుల నాయుడు తన సిబ్బందితో అడ్డుకున్నారు. మంత్రికి మాత్రమే అనుమతి ఉందని, అనుచరులకు లేదని సీఐ చెప్పడంతో మంత్రి సీదిరికి అవేశం కట్టులు తెంచుకుని కొడకా లాగి కొడతా.. అంటూ దుర్భాషలాడి.. దాడి చేశాడు. అంతేకాక తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. కట్ చేస్తే.. గురువారం ఈ ఘటనపై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి బహింరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బాధ్యత గల పదవిలో ఉండి పోలీసు అధికారిపై దౌర్జన్యం చేయడం తగదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది!
మొన్న రెవన్యూ సంఘాలు.. నేడు పోలీసు సంఘాలా?
మంత్రి సీదిరి చిత్రాలు అన్నీఇన్నీ కావు! ఆయన నోటి దురుసును విపక్షాలపైనే కాదు, అధికారులుపైనా చూపుతాడు!! ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి అప్పలరాజు అక్కడుకొచ్చిన వీఆర్వోలపై మండిపడ్డారు. వీఆర్వోలను సచివాలయాల్లో రాకుండా చూడాలని, వస్తే తరిమికొట్టాలను అధికారులను ఆదేశిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పలరాజు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల సంఘాలు మండిపడ్డాయి. రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశాయి! రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఆందోళనకు దిగారు. మంత్రి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అది అలా ముగిసిన తరువాత.. ఈసారి పోలీసులపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా దాడికి యత్నించారు. దీంతో పోలీస్ అధికారులు సంఘాలు మంత్రిని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అధికారం ఉంది కదా.. అని చెలాయించాలని చూస్తే.. ప్రజాస్వామ్యంలో పరాభవం చవిచూడక తప్పదని ఇప్పటికైనా తెలుసుకుంటే మంత్రికి మంచిదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Must Read:-మంత్రి అప్పలరాజుపై పోలీసు సంఘం ఆగ్రహం! బహిరంగ క్షమాపణకు డిమాండ్!











