విక్టరీ వెంకటేశ్ , మీనా ప్రధాన పాత్రల్లో మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తెర కెక్కిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం2’. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ ‘దృశ్యం 2’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ను చాలా స్పీడ్ గా చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. మొదటి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. అప్పుడే దాదాపు గా 40 శాతం చిత్రీకరణ పూర్తయిందట. ఇప్పుడు రెండో షెడ్యూల్ కేరళలో జరుగుతోంది.
మలయాళ వెర్షన్ ను లాక్ డౌన్ టైమ్ లో.. దాదాపుగా 46 రోజుల్లో కంప్లీట్ చేసిన జీతు .. తెలుగు వెర్షన్ ను కూడా అన్నే రోజుల్లో కంప్లీట్ చేసేలా ఉన్నాడు. ఆల్రెడీ ఈ సినిమాను చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూసేశారు. దాంతో ఏమాత్రం లేట్ చేయకుండా.. తెలుగు వెర్షన్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. అందుకే షూటింగ్ ను చాలా స్పీడ్ గా చేసేస్తున్నాడు దర్శకుడు.
వెంకీ ‘నారప్ప’ సినిమా మే 14న విడుదలవుతుండగా.. ‘ఎఫ్ 3’ సినిమా ఆగస్ట్ 27న విడుదల కానుంది. ఈ రెండింటి మధ్యలో అంటే.. జూన్ లో గానీ, జూలై లో కానీ దృశ్యం 2 సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అదే కానీ జరిగితే.. ఈ ఏడాది వెంకీ నుంచి ఏకంగా మూడు సినిమాలు అభిమానులు చూసే వీలు కలుగుతుంది. కొంత కాలంగా.. తెలుగు హీరోల నుంచి ఈ తరహాలో ఒకే ఏడాదిలో ఇన్ని సినిమాలు రావడం చూళ్ళేదు ప్రేక్షకులు. ఒక విధంగా వెంకటేశ్ కి ఇది రికార్డే అనుకోవాలి. మరి నిజంగానే ‘దృశ్యం 2’… ‘నారప్ప, ఎఫ్ 3’ మధ్యలో విడుదలవుతుందో లేక తర్వాత విడుదలవుతుందో చూడాలి.
Also Read:వెంకీ యంగ్ ‘నారప్ప’ లుక్ అదుర్స్











