విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందిన సంచలన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ ఇటీవల ఎనౌన్స్ చేయడం జరిగింది. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘ఎఫ్ 2’ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ‘ఎఫ్ 3’ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఎన్ని అంచనాలతో ప్రేక్షకులు థియేటర్ కి వచ్చినా ఖచ్చితంగా ‘ఎఫ్ 3’ ఆకట్టుకుంటుందని అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
రీసెంట్ గా ‘ఎఫ్ 3’ షూటింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఈరోజు ఈ షూటింగ్ లో విక్టరీ వెంకటేష్ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్ గా తెలియచేసింది. ఇప్పటి వరకు నారప్ప గెటప్ లో ఉన్న వెంకీ ‘ఎఫ్ 3’ లుక్ లో మారిపోయారు. ఈ లుక్ లో చాలా స్మార్ట్ గా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. వెంకీ, తమన్నాల పై మాంచి రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేసారట. ‘ఎఫ్ 2’ తో పోలిస్తే.. ‘ఎఫ్ 3’ లో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుందట. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం బిగ్ బాస్ హౌస్ వేస్తున్నారట. దీనిని బట్టి బిగ్ బాస్ హౌస్ కామెడీ ఈ సినిమాలో స్పెషల్ గా డిజైన్ చేసారని తెలుస్తుంది.
ప్రస్తుతం వెంకీ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ జాయిన్ కానున్నారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసారట. ఎఫ్ 2 వలే ఎఫ్ 3 లో కూడా సాంగ్స్ ఆల్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయట. మొత్తానికి అనిల్ రావిపూడి ఎఫ్ 3ని గట్టిగానే ప్లాన్ చేసారనిపిస్తుంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఎఫ్ 3 ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.
Must Read ;- అందాల తారాజువ్వ తమన్నా (బర్త్ డే స్పెషల్)
Fun begins on sets !!!
First day of #F3Movie shoot. Welcome @VenkyMama garu.
🎉🎉💐💐 pic.twitter.com/0iUn1sdsZs— Anil Ravipudi (@AnilRavipudi) December 23, 2020