తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా‘ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్య అభిమానులతో పాటుగా సామాన్య ప్రేక్షకులకు కూడా బాగా నచ్చిన సినిమా ఇది. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయం అందుకుంది. తెలుగు స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని చూసి తన ఫిలింగ్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాలన్నిట్లో కన్నా ‘ఆకాశం నీ హద్దురా‘ సినిమా బాగా నచ్చిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా సూర్య నటన అద్భుతంగా ఉందని, అలాగే సినిమా యూనిట్ కు తన అభినందనలు అని ట్విట్ చేసారు మహేష్. ఆయన స్పందనపై ట్విట్టర్ ద్వారా స్పెషల్ థాంక్స్ తెలిపారు హీరో సూర్య. ‘మీకు స్పెషల్ థాంక్స్ బ్రదర్, అలాగే మీరు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం మీ అభిమానులతో పాటు నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని రిప్లై ఇచ్చాడు సూర్య.
ఈ ట్వీట్లు ఇద్దరి అభిమానులలో మంచి జోష్ నింపాయి. ఇక ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ రీమేక్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకు దర్శకత్వం వహించిన సుధ కొంగరకే హిందీ రీమేక్ బాధ్యతలు కూడా అప్పగిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి విజయవంతంగా దూసుకుపోతోంది.
Must Read ;- ట్రైలర్ టాక్ : 1రూపాయికే విమానయానం కల్పించిన వ్యక్తి కథ ‘ఆకాశం నీ హద్దురా’
#SooraraiPottru 👏👏👏 What an inspiring film!! Brilliantly directed with amazing performances… @Suriya_offl in top form😎😎😎Shine on brother…🤗🤗🤗Congrats to the entire team👌👌👌@Aparnabala2 @Sudhakongara_of @gvprakash @nikethbommi
— Mahesh Babu (@urstrulyMahesh) November 18, 2020
@urstrulyMahesh very kind of you brother! Thanks a ton! Looking forward for #SarkaruVaariPaata 👊🏽 https://t.co/E0xumD7RfI
— Suriya Sivakumar (@Suriya_offl) November 19, 2020











