ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూ..మరో వైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఆమధ్య వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన 118 సినిమాతో సక్సస్ సాధించారు. ఆతర్వాత నటించిన ఎంత మంచివాడవురా సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో కళ్యాణ్ రామ్ ఇక పై చేసే సినిమాల విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారట. అది ఏంటంటే.. బలమైన కథాంశం ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకోవాలని.. రెగ్యులర్ స్టోరీలతో సినిమాలు చేయకూడదని. 118 లాంటి విభిన్నమైన ప్రయత్నంతో హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసారా అనే పీరియాడిక్ టైం ట్రావెల్ మూవీ చేస్తున్నాడు.
ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. నవీన్ అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన స్టోరీకి కళ్యాణ్ రామ్ ఓకె చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ నామ నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్ర కథా నేపథ్యం విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు 1950 బ్యాక్ డ్రాప్ ఎంచుకుని స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొంచాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ 1950 కాలానికి చెందిన గూఢచారిగా కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కధా చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడానికి ఇంకాస్త టైమ్ పట్టచ్చు. బింబిసారా చిత్రంలో కళ్యాణ్ రామ్ వారియర్ కింగ్ గా ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాని అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు. ఈ చిత్రానికి మల్లిడి వసిస్ట్ దర్శకుడు. మగధ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. ఇలా.. కళ్యాణ్ రామ్ రెగ్యులర్ మూవీస్ కాకుండా విభిన్న కథా చిత్రాలతో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇవి ఒక రకంగా ప్రయోగాత్మక చిత్రాలే. మరి.. కళ్యాణ్ రామ్ ప్రయోగాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
Must Read ;- నందమూరి హీరోలతో మల్టీస్టారర్ కు రెడీ అవుతోన్న స్టార్ డైరెక్టర్











